Devara Trailer Review: దేవర ట్రైలర్ రివ్యూ.. వాడికి అయ్య రూపం వచ్చింది.. రక్తం రాలేదు అంటూ సెటైర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందించిన ఈ చిత్రం దేవర. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
దేవర మూవీ ప్రమోషన్స్‌ను ముంబైలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం కరణ్ జోహర్, సందీప్ రెడ్డి వంగ, ఆలియా భట్ తదితరులతో కలిసి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేశారు. ఈ క్రమంలో ఉత్తరాది, జాతీయ మీడియా సమక్షంలో అట్టహాసంగా ముంబైలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన దేవర ట్రైలర్.. కులం లేదు.. మతం లేదు.. భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏదీ తెలియని కళ్లలో భయం పురుడు కమ్ముకొన్నాయి. అందంతా పెద్ద కథ.. రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ అంటూ చెప్పాడు.
మనిషికి బతికేంత భయం చాలూ.. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అంటూ ఆ ధైర్యాన్ని కూడగడితే.. దానిని చంపేసే భయాన్ని అయితా అని వార్నింగ్ ఇవ్వడం కనిపించింది. ఇక సైఫ్ ఖాన్ మాట్లాడుతూ.. దేవరను చంపాలంటే.. సరైనా సమయే కాదు.. సరైనా ఆయుధం కూడా కావాలి అని అనడం బట్టి చూస్తే.. వారిద్దరి మధ్య వైరం, పగ. ప్రతీకారం ఉన్నట్టు కనిపించింది.
ఇక పని మీద పోయిన వాడు.. పని కాగానే వస్తాడు.. కానీ పంత పట్టి పోయాడు నీ కొడుకు అంటూ ఆవేశంగా మాట్లాడుతుంటాడు. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఇరు వర్గాల మధ్య వైరం.. తండ్రి, కొడుకుల కథగా చెప్పకనే ట్రైలర్‌లో కొరటాల శివ చెప్పాడు.
ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ ఓ సీన్‌లో సెటైర్ వేస్తూ.. ఎప్పుడూ చూడు పిల్లతనం. పిరికితనం.. ఆడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కానీ.. రక్తం రాలేదే.. అంటూ చెబుతుంటుంది.
భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న దేవర సినిమా ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగుతోపాటు తొలిసారి హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. దేవర సినిమా ద్వారా జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులోకి అడుగు పెడుతున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











