PSPK 28 : స్క్రిప్ట్ అదిరిపోయింది.. రెండు సాంగ్స్ కూడా.. రివీల్ చేసిన దేవిశ్రీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ సినిమాకు ఎనలేని క్రేజ్ లభించింది. పవన్ క్రేజ్, సినిమా కంటెంట్ అన్నీ బాగా కుదరడంతో మొత్తం మీద సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూసివేసిన నేపధ్యంలో త్వరగానే సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా పూర్తవడంతో పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టాడు.. ప్రస్తుతానికి ఆయన చేస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలు మొదలు కావాల్సి ఉంది.

Recommended Video

PSPK 28 : స్క్రిప్ట్ కెవ్వుకేక, మరో గబ్బర్ సింగ్ కి గెట్ రెడీ | Pawan Kalyan || Filmibeat Telugu

కళ్ళతోనే మత్తు మందు జల్లుతున్న మేఘాలి

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సినిమా రీమేక్ షూటింగ్ సగం పూర్తయింది.. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని కీలక అంశాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా గురించి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సినిమా స్క్రిప్ట్ సూపర్ డూపర్ గా ఉందని అన్నారు.. ఇది హరీష్ శంకర్ స్క్రిప్ట్ కావడంతో కచ్చితంగా ఇందులో అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు.

Devi Sri Prasad about PSPK 28 movie

ప్రస్తుతం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే అంశం మీద ఆశక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ కూడా పూర్తయ్యాయని మిగతా పాటలు పూర్తి చేసే పనిలో ఉన్నామని దేవి శ్రీ చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ తరువాత మళ్లీ అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు ఉంటాయని ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దేవి శ్రీ మాటలు వింటుంటే ఈ సినిమా కూడా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అని చెప్పక తప్పదు. చూడాలి మరి ఏమవుతుందో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X