దేవీ శ్రీ ప్రసాద్ చెవులు పిండి.. పనులు చేయించిన అల్లుడు.. ఎమోషనల్‌గా వీడియో

కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో ఇంటి పనుల్లో భాగం కావాలని సినీ ప్రముఖులు విసురుకొంటున్న Be The RealMan Challengeకు మంచి స్పందన లభిస్తున్నది. సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి, వెంకటేష్, కొరటాల శివ, సుకుమార్, విజయ్ దేవరకొండ, చిరంజీవి తదితరులు స్వీకరించిన ఈ ఛాలెంజ్‌కు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా సుకుమార్ విసిరిన సవాల్‌ను దేవీ శ్రీ ప్రసాద్ స్వీకరించారు. కానీ దేవీ శ్రీ ప్రసాద్ అల్లుడు చెవులు పిండి పని చేయించడం ఈ వీడియోలో ప్రత్యేకతగా మారింది.

దేవీ శ్రీ ప్రసాద్‌ను నిద్రలేపి బయట ప్రపంచాన్ని చూడు అందరూ బీ రియల్ మ్యాన్‌ ఛాలెంజ్‌ను ఫర్‌ఫెక్ట్‌గా చేస్తున్నారు.. నీకు సుకుమార్ ఛాలెంజ్‌ విసిరాడు అంటూ చిపిరి తదితర వస్తువులను ముందు పడేసి అల్లుడు పనుల్లోకి పురమాయించాడు.

Devi Sri Prasad accepted Sukumars Be The Real Man Challenge

ఇక అన్నీ చేతపట్టుకొని ఇంటిని శుభ్రం చేయడం, కడగడం, అట్లు తోమే పనులను భుజానకెత్తుకొన్నాడు. చివరకు తల్లికి బ్రెడ్ ఆమ్లేట్ చేసి ఇచ్చి రియల్ మ్యాన్ అనిపించుకొన్నారు. ప్రపంచంలో ప్రతీ రియల్ మ్యాన్‌ వెనుక ఉండే తల్లికి ఈ వీడియోను అంకితం చేశారు. చివర్లో తన తండ్రి సత్యానంద్‌ ఫోటోలకు మొక్కి ప్రేమను చాటుకోవడమే కాకుండా ఈ వీడియోను ఎమోషనల్‌గా మార్చారు.

తన తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బీ రియల్ మ్యాన్ కావాలని ఛాలెంజ్‌ను విసిరారు. ఇప్పటికే అల్లు అర్జున్ పలువురు ఛాలెంజ్‌లు విసరగా.. ఆయన ఇంకా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X