హరీష్ శంకర్‌కు క్షమాపణ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్.. కారణం ఏంటంటే..?
దేవీ శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే సంగీత ప్రియులకు ఎప్పుడూ ఇష్టమే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్యా, డీజే లాంటి సినిమాలు చూస్తేనే అది తెలుస్తుంది. అంతలా ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా ఉంటాయి. తెరపైనే కాకుండా.. తెర వెనుక కూడా దర్శకుడు, సంగీత దర్శకుడు ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకుంటేనే సంగీతం కుదురుతుందని చెప్పుకొస్తుంటారు.
హరీష్ శంకర్, దేవీ శ్రీ ప్రసాద్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో హరీష్ శంకర్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ అందులో దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా ట్యాగ్ చేశాడు.

అయితే ఆ ట్వీట్‌ను ఆలస్యంగా చూసిన దేవీ.. హరీష్‌కు సారీ చెబుతూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడే చూశాను.. లవ్లీ ఎనర్జిటిక్ విషెస్‌కు థ్యాంక్స్ అంటూ తిరిగి ట్వీట్ చేశాడు. దేవీ ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
అసలే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ఒకే రోజున విడుదల కానుండటంతో ఈ మూవీ మ్యూజిక్ అదిరిపోవాలని అద్భుత మైన ట్యూన్స్ కడుతున్నట్టు టాక్. తమన్ ఇప్పటికే ఊపేస్తుండగా.. దేవీ కూడా త్వరలోనే రంగంలోకి దిగనున్నాడు.


Click it and Unblock the Notifications











