నితిన్, రష్మిక కూల్ పర్ఫామెన్స్.. ‘భీష్మ’పై దేవీ కామెంట్స్
యంగ్ హీరో నితిన్, రష్మిక మందాన్న కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భీష్మ. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఛలో వంటి సూపర్ హిట్ తరువాత వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా ఇటు నితిన్‌కు, వెంకీ కుడుములకు భారీ హిట్టు పడింది. రెండు రోజుల కలెక్షన్స్ బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీని దేవీ శ్రీ ప్రసాద్ వీక్షించినట్టు తెలుస్తోంది.
భీష్మ చిత్రాన్ని వీక్షించిన దేవీ శ్రీ ప్రసాద్.. సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేశానని, నితిన్, రష్మిక కూల్ పర్ఫామెన్స్ ఇచ్చారని రాసుకొచ్చాడు. వెంకీ కుడుముల అద్భుతంగా రాశాడు.. అంతే అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడాడు. మహతి స్వాగర్ సంగీతం బాగుందని మెచ్చుకున్నాడు. సితార ఎంట్టరైన్మెంట్‌కు మరో హిట్ లభించిందని అన్నాడు. దేవీ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ... థ్యాంక్యూ సో మచ్ డీఎస్పీ గారు అంటూ నితిన్ పోస్ట్ చేశాడు.

భీష్మ ఈ రెండు రోజుల్లో కలెక్షన్ల పరంగా దుమ్ములేపింది. మొదటి రోజు దాదాపు 8 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా.. రెండో రోజూ అదే దూకుడును ప్రదర్శించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 4 కోట్లను కొల్లగొట్టగా.. మొత్తంగా ఈ రెండు రోజుల్లో 10.52కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. 25కోట్ల షేర్‌ను కొల్లగొట్టే లక్షంతో దిగిన భీష్మ.. త్వరలోనే బ్రేక్ ఈవెన్అయ్యేట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











