భవదీయుడు భగత్‌సింగ్‌ నుంచి కిక్కిచ్చే న్యూస్: అందులో గబ్బర్ సింగ్‌ను మించిపోతుందట

ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చినా.. మధ్యలో రాజకీయాల కోసం సినీ రంగానికి గ్యాప్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో ఈ స్టార్ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడీ మెగా హీరో. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకోవడంతో పాటు వాటిని పూర్తి చేయబోతున్నాడు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీన్ని ఆలస్యంగా ప్రారంభించినా.. ముందే పూర్తి చేయబోతున్నాడు. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఫిబ్రవరి 25వ తేదీకి దీన్ని వాయిదా వేసేశారు.

 Devi Sri Prasad Creating Super Album for Bhavadeeyudu Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే మొదలు పెట్టిన చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివరి నుంచి ఈ మూవీ షూట్‌లో పవన్ పాల్గొంటాడట. ఇది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ చేయబోయే ప్రాజెక్టు స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనే అన్న విషయం తెలిసిందే.

హరీశ్ శంకర్‌తో పవన్ కల్యాణ్ చేసే సినిమానే 'భవదీయుడు భగత్‌సింగ్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు. అంతేకాదు, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయని తెలుస్తోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని పాటలన్నీ అదిరిపోయేలా ఉండబోతున్నాయని తెలిసింది. గతంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన 'గబ్బర్ సింగ్'ను మించేపోయేలా ఈ సినిమా కోసం ఆల్బమ్ రెడీ చేస్తున్నాడట దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పటికే పలు పాటలను కూడా రెడీ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'భవదీయుడు భగత్‌సింగ్' మూవీలో పవన్ కల్యాణ్ రోల్ అదిరిపోయేలా డిజైన్ చేశాడట హరీశ్ శంకర్. ఇక, ఇది ఎంటర్‌టైనర్‌గానే కాకుండా సందేశాత్మకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X