DNS మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీతో దేవీ శ్రీ ప్రసాద్.. మ్యూజిక్‌తో మేజిక్ చేస్తాడా?
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మాయ చేస్తాడనే సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపిస్తూ వస్తున్న ఈ సంగీత దర్శకుడు ప్రస్తుతం పుష్ప 2, కంగువా వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో భారీ మల్టీ స్టారర్ మూవీకి సంగీతం అందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన మ్యూజిక్ ఉంటే సగం సినిమా హిట్టే అన్నట్లే.. అంతలా ఆయన క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్నారు. అసలు ఆ సినిమా ఏంటి.. హీరోలు, దర్శకులు ఎవరు అనే వివరాల్లోకి వెళితే...
దేవి శ్రీ ప్రసాద్.. తన మ్యూజిక్ తో మాయ చేస్తాడు.. మైమరిచి పోయేలా చేస్తాడు.. లవ్ సాంగ్స్ అయినా.. లవ్ ఫెయిల్యూర్ అయినా.. మాస్ మసాలా సాంగ్స్, ఐటెం సాంగ్స్.. ఇలా ఏదైనా తనదైన స్టైల్ లో సంగీతం సమకూర్చి.. ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తాడు. ఇక ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ పుష్ప సినిమాలోని సాంగ్స్ ఎంత హిట్ అయ్యోయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక అంతకు మించి పుష్ప 2 సాంగ్స్ కోసం.. అటు రైటర్ చంద్రబోస్ తో కలిసి దేవి శ్రీ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్టుతో పాటు దేవి చేస్తున్న భారీ ప్రాజెక్టు కంగువ.
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ అదిరిపోయింది. ఆ గ్లింప్స్ కు అందించిన మ్యూజిక్ వెరే లెవెల్. ఇక సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే..మరో భారీ మల్టీ స్టారర్ మూవీకి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబోలో రాబోతున్న చిత్రానికి సంగీతం దేవీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సార్ లాంటి తెలుగు సినిమాతో సక్సెస్ కొట్టిన ధనుష్ మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇందులో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తాజాగా హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో సినిమా షూటింగ్ ను ప్రారంభం అయింది. ఈ సినిమా ధనుష్ కెరీర్ లో ఈ సినిమా 51వ మూవీగా తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.

శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఉంటాయి. మరి అలాంటి దర్శకుడు ఈసారి ఎలాంటి కథతో వస్తాడో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల చిత్రానికి పాటలు ప్లస్. మరి దేవి తన పాటలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











