Pushpa 2 : ఫ్రస్ట్రేషన్‌లో దేవిశ్రీ , నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ .. ఏకంగా అల్లు అర్జున్ ముందే
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ (పుష్ప 1)కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, పోస్టర్స్ అన్ని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే.
దేశవ్యాప్తంగా ఇంతటి భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు. అలాగే గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేసి మరో సంచలనం సృష్టించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

పాట్నా వేదికగా రిలీజైన పుష్ప 2 ట్రైలర్ .. మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల రికార్డులను బద్ధలుకొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం పుష్ప 2 వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫైర్ అయ్యింది. పుష్ప 2 విడుదల షెడ్యూల్ సమయానికే థియేటర్లలో దిగుతుందని.. డిసెంబర్ 4న యూఎస్‌లో ప్రీమియర్స్‌తో సందడి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఇక ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరైన సుకుమార్.. పుష్ప పార్ట్ 1లో సమంతతో స్పెషల్ చేయించాడు. పుష్ప పార్ట్ 2లో శ్రీలీలకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. కిస్సిక్ అంటూ సాగే ఆ మసాలా సాంగ్ అప్పుడే ట్రెండ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో చెన్నైలో శనివారం పుష్ప 2 ది రూల్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అల్లు అర్జున్ సహా రష్మిక మందన్న, శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. రాక్ స్టార్ డీఎస్పీ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. హుషారైన మాటలు, పంచ్‌లతో ఆయన జోష్ తీసుకొస్తాడు. ఇన్నాళ్లలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలు లేవు. అలాంటిది తొలిసారిగా దేవిశ్రీ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. నేరుగా పుష్ప నిర్మాతలనే ఆయన టార్గెట్ చేశారు.

రవిశంకర్ సార్.. ఈ రోజు కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాని మొదలెట్టిన డీఎస్పీ.. నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకీ బీజీఎఎం లేదు, టైంకి ఈవెంట్‌కి రాలేదు అని అనొద్దని వ్యాఖ్యానించారు. నా మీద మీకు ప్రేమ ఉంది.. అలాగే కంప్లయంట్స్ కూడా ఉంటాయన్నారు. వేదిక వద్దకు వచ్చే సమయంలో రాంగ్ టైమింగ్ అంటున్నారని.. ఇవన్నీ పర్సనల్‌గా అడిగే కంటే ఓపెన్‌గా డిస్కష్ చేసుకుంటే బెటర్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











