Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రిపీట్ కానున్న గబ్బర్ సింగ్ కాంబో.. దేవీ శ్రీ ప్రసాద్, రత్నవేలు కామెంట్స్
పవన్ కళ్యాణ్ తన అభిమానులకు షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నాడు. ఒక్క సినిమాలో నటిస్తే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక అయితే టన్నుల్ టన్నుల్ ఇస్తా అని జల్సా సినిమాలో డైలాగ్ మాదిరి ఒకటి కాదు రెండు కాదు మూడు చిత్రాలను లైన్లో పెట్టేశారు. ఇప్పటికే మూడింటిని అధికారికంగా ప్రకటించేశాడు.
పింక్ రీమేక్ షూటింగ్ మొదలు..
పవన్ చేయబోయే అన్ని సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవే. వీటిలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. షూటింగ్ సమయంలో లీకైన పిక్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మరోవైపు క్రిష్ సినిమా..
విభిన్న దర్శకుడు క్రిష్ తెరకెక్కించే సినిమాల గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్‌గా పేరున్న క్రిష్.. మొఘలుల కాలం నాటి ఓ పీరియాడిక్ కథతో పవన్ కళ్యాణ్ చేయబోతోన్న చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది.
మూడో సినిమా ప్రకటన..
మైత్రీ మూవీస్ పవన్ కళ్యాణ్‌కు గతంలో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి కమిట్మెంట్స్కు అనుగుణంగా పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రాన్ని నిర్మించబోతోన్నట్లు ప్రకటించింది మైత్రీ మూవీస్. గబ్బర్ సింగ్ తరువాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి కాంబో ఈ విధంగా సెట్ అయింది.
దేవీ, రత్నవేలు రియాక్షన్..
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్‌కు అంతే రేంజ్లో అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. ముఖ్యంగా కెవ్వు కేక అనే ఐటెమ్ సాంగ్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కాంబోను ఉద్దేశిస్తూ.. కెవ్వు..కేక అంటూ ట్వీట్ చేశాడు. చిత్ర బృందానికి కంగ్రాట్స్ అంటూ రత్నవేలు ట్వీట్ చేశాడు.