దేవిశ్రీలో ఓపిక నశించిందా? .. పదేళ్ల తర్వాత వైల్డ్ ఫైర్ చూపించిన రాక్‌స్టార్

భారతీయ సినిమా దగ్గర సినిమాలో యాక్షన్, డ్రామాతో పాటుగా పాటలు కూడా మనకి రక్తంలో ఎప్పుడు నుంచో ఇంకిపోయాయి. సినిమాల్లో పాటలు కూడా ఎంతో ప్రాధాన్యతగా మారిపోయిన ట్రెండ్ నుంచి ఇప్పటికీ పలు సినిమాలు అయితే కేవలం పాటలతో హైప్ లేచినవి కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్ లుగా పాడుకుంటారు జనం. ఇప్పటికీ కూడా ప్రతి మ్యూజిక్ లవర్ కి దేవిశ్రీ ప్రసాద్ పాట లేనిదే రోజు గడవదు. అలాంటి సంగీత దర్శకుడిపై ఇటీవల పలు షాకింగ్ వార్తలు వైరల్ గా మారాయి.

devi sri prasad shows his wild fire at pushpa 2 event

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి క్రేజీ మ్యూజికల్ కాంబినేషన్ లలో సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అలా ఇపుడు వీరి నుంచి పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తున్న సినిమానే "పుష్ప 2". ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెడుతున్నారు అని , రీరికార్డింగ్ భాద్యతలు థమన్ కి ఇస్తున్నారు అని చాలా రూమర్స్ వచ్చాయి.

వీటిపై ఎక్కడా స్పందించని దేవిశ్రీ నిన్న చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్ లో అందరికీ షాకిచ్చాడు. డైరెక్ట్ గా పుష్ప 2 నిర్మాతలపై అటాక్ చేస్తూ ఇచ్చి పడేసాడు. మనకి ఏదన్నా కావాలి అంటే మనమే అడిగి తీసుకోవాలి ఎవరూ ఏది ఇవ్వరు.. టైం కి పాట ఇవ్వలేదు, టైం కి స్కోర్ ఇవ్వలేదు అనొద్దు అని దేవిశ్రీ చెప్పారు. నా మీద మీకు ప్రేమ ఉంది కాదనలేదు .. ప్రేమ ఉన్న చోట కంప్లైంట్స్ కూడా ఉంటాయి.. కానీ మీకు నా మీద కంప్లైంట్స్ ఉన్నాయి . ఇలాంటివి అన్నీ సెపరేట్ గా అడిగినపుడు పెద్దగా కిక్ ఉండదు అందుకే ఇలాగే అడిగెయ్యాలి అంటూ స్టేజి మీదే కడిగేశాడు రాక్‌స్టార్.

devi sri prasad shows his wild fire at pushpa 2 event

మొత్తానికి మైత్రి మేకర్స్ విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ చాలా హర్ట్ అయ్యాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇలా దేవిశ్రీ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా పదేళ్ల కితం 2014లో "లెజెండ్" సినిమాకి కూడా దర్శకుడు బోయపాటి శ్రీనుపై కూడా ఆన్ స్టేజ్ లోనే గట్టి కౌంటర్లు ఇచ్చేసాడు.

తాజాగా ఇపుడు మళ్లీ 2014 నుంచి 2024కి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది అంటూ ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తం మీద దేవిశ్రీ ప్రసాద్ మాత్రం పుష్ప 2 విషయంలో చాలా డిజప్పాయింట్ గా ఉన్నాడని చెప్పి తీరాలి. రిలీజ్ డేట్ దగ్గరపడటానికి ముందే పుష్ప 2 నుంచి మరిన్ని ఈవెంట్స్ ఉన్నాయి. వీటిలో ఇంకెలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి . ఇక ఈ భారీ సినిమా అయితే ఈ డిసెంబర్ 5న గ్రాండ్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X