Devara Update: NTRను అలా చూస్తుంటే బాధగా ఉన్నా తప్పడం లేదు... కల్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా గురించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సాలిడ్ అప్డేట్స్ అయితే రాలేదు. అయితే ఈ చిత్ర నిర్మాత హీరో కల్యాణ్ రామ్.. తన తమ్ముడు నటిస్తున్న దేవర గురించి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

Recommended Video

Devara Teaser BGM పై Anirudh Comments.. All Hail The Tiger | Telugu Filmibeat

జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఇక ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. కాగా ఈ చిత్రానికి నిర్మాతగా నందమూరి హీరో కల్యాణ్ రామ్‌ వ్యవహారిస్తున్నాడు. ఇక మొదటి నుంచి ఈ సినిమాపై ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు ఈ హీరో. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో దేవర సినిమా వస్తుంది.

Devil Hero Kalyan Ram Giving Ntr Koratala Siva Shooting Update Full Details Here

ఇక దేవర గురించి హీరో కల్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలను ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేవర రెండు పార్టులుగా వస్తుండగా.. దేవర పార్ట్ 1.. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వెల్లడించారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ పూర్తయిన వెంటనే టీం మెంబర్స్ త్వరలోనే దేవర గ్లింప్స్ లాంఛ్ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దేవర సినిమా కోసం తారక్‌ చాలా కష్టపడుతున్నారని.... విజువల్‌ వండర్‌ గా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు.

ఇక దేవర బడ్జెట్‌ విషయంలో కాంప్రమైజ్‌ అవ్వలేదని స్పష్టం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ తర్వాత తమ్ముడు ఎన్టీఆర్ పై అంచనాలు పెరిగిపోవడంతో. మాపై చాలా ఒత్తిడి ఉందని వెల్లడించారు. గోవాలోని సెట్స్‌ లో దేవర అండ్ గ్యాంగ్‌ పై వచ్చే చిన్న సెలబ్రేషన్ మ్యూజిక్‌ బిట్‌ ను షూట్ చేసినట్టు తెలిపారు కల్యాణ్ రామ్. ఇప్పటికే సూపర్ కిక్‌ ఇచ్చే అప్‌డేట్ అందించగా.. తారక్‌ సెట్స్‌ లో డ్యాన్సర్లతో కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా దేవర ఆలస్యమవకుండా క్లైమాక్స్ ను కంప్లీట్ చేసేందుకు కొరటాల టీం పూర్తి చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు మీరు తెలుగు సినిమాలో ఎప్పుడు చూడనన్నివిజువల్స్ ఉన్నాయి. తమ్ముడ్ని రోజంతా రోప్స్ వేసి కూర్చోబెడుతుంటే ఒకవైపు బాధగా ఉంది మరోవైపు కష్టపడుతున్నాడని ఆనందంగా ఉంది.. 2024 ఎన్నికల గురించి నేను తమ్ముడు ఫ్యామిలీ అంతా ఒక నిర్ణయం తీస్కోని అప్పుడు అందరికి చెప్తాం.. అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు.

Devil Hero Kalyan Ram Giving Ntr Koratala Siva Shooting Update Full Details Here

దేవరలో బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్.. తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

దేవరలో ఎన్టీఆర్‌ పై వచ్చే అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌ కానుందని తెలుస్తోంది. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. దేవర పార్ట్‌ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X