twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెండితెరపై దేవినేని నెహ్రూ బయోపిక్.. మరో వివాదాస్పద చిత్రమా.. బెజవాడ భగ్గుమంటుందా?

    |

    నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. "దేవినేని" టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై దేవినేని నెహ్రూ బయోపిక్ గా తీస్తొన్న ఈ సినిమాకు రాము రాథోడ్ నిర్మాత. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి, సీనియ‌ర్ ఆర్టిస్ట్ జ‌మున కెమెరాస్విచాన్ చేయ‌గా సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావుగారు ఫ‌స్ట్ షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వివరాల్లోకి వెళితే..

    నెహ్రూనే కాంట్రవర్సీ ఎందుకన్నారు..

    నెహ్రూనే కాంట్రవర్సీ ఎందుకన్నారు..

    ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు శివ‌నాగు మాట్లాడుతూ... ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నంద‌మూరి తార‌క్‌గారు పోషించ‌గా మిగ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో పెద్ద ఆర్టిస్టులు న‌టిస్తున్నారు. నేను ఈ సినిమా చేద్దాం అనుకునే ముందు విజ‌య‌వాడ మొత్తం తిరిగి అంద‌ర్నీ క‌లిసి తెలుసుకున్నాను. గ‌తంలో ఒక‌సారి ఈ క‌థ గురించి నెహ్రూగారిని కూడా క‌లిశాను. కానీ ఆయ‌న అప్పుడు ఎందుకు శివా అన‌వ‌స‌రంగా కాంట్ర‌వ‌ర్సీ చేస్తున్నారు. మీకు ఇంత‌కు మించిన క‌థ‌లు లేవా అని అన్నారు. కానీ నేను అలా కాదు నేను మీరు నాయ‌కుడుగా ఎన్నో మంచి ప‌నులు చేశారు వాటి గురించి చాలా మందికి తెలియ‌డం కోసం చేస్తున్నాను అని అన్నాను. ఒక‌సారి క‌థ చెప్పాను ఆయ‌న‌కు విని ఓకే చెయ్య‌మ‌న్నారు. ఆ త‌రువాత అనుకోకుండా ఆయ‌న చ‌నిపోవ‌డం జ‌రిగింది.

     హీరో తారక్ కథ చెబితే

    హీరో తారక్ కథ చెబితే

    ఇటీవల మా హీరో తార‌క్‌కు ఈ క‌థ చెప్ప‌గానే ఓకే అన్నారు. అని కొన్ని మార్పులు చెప్పారు. న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మా జ‌మున‌మ్మ‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు. మార్పు చేసి చెప్ప‌గానే ఓకే అన్నారు. మే 10నుంచి రెగుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ద‌స‌రాకి విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నాం. ఈ క‌థ 1977లోని క‌థ‌. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ అనుకుంటున్నాం అని అన్నారు.

    పెదనాన్న లాంటి వ్యక్తి క్యారెక్టర్‌లో

    పెదనాన్న లాంటి వ్యక్తి క్యారెక్టర్‌లో

    హీరో తార‌క్ మాట్లాడుతూ... మా ఫ్యామిలీకి ఎంతో స‌న్నిహితులైన వ్య‌క్తి. పెద‌నాన్న‌ లాంటివారు. ఆయ‌న పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంది. ద‌ర్శ‌కులు శివ‌నాగు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ఆయ‌న ఎన్నో మంచి చిత్రాల‌ను తీశారు. ఈ సినిమాకి రాము లాంటి మంచి ప్రొడ్యూస‌ర్ దొర‌క‌డం మా అదృష్టం. ఈ సినిమా మంచి హిట్ అయి ప్రొడ్యూస‌ర్‌కి బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. మా అమ్మ జ‌మున చేతుల మీదుగా ఈ సినిమా రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

     శివనాగు కసి ఉన్న దర్శకుడు

    శివనాగు కసి ఉన్న దర్శకుడు

    ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ... దేవినేని చిత్రానికి ప్రొడ్యూస్ చెయ్య‌డం నా అదృష్టం. ఆయ‌న ఇక్క‌డ లేక‌పోయినా పైలోకాల నుంచి న‌న్ను ఆశీర్వ‌దిస్తారు. ఆయ‌న పై నుంచి ఇచ్చే అండతో ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చాం. శివ‌నాగు మంచి క‌సి ఉన్న ద‌ర్శ‌కుడు. ఆయ‌న దొర‌క‌డం మా అదృష్టం ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. జ‌మున‌మ్మ ప‌క్క‌న కూర్చోవ‌డ‌మే నా అదృష్టం. ఆమెకు నా మ‌న‌స్సుమాంజ‌లి అని అన్నారు.

     30 ఏళ్ల తర్వాత మళ్లీ జమున

    30 ఏళ్ల తర్వాత మళ్లీ జమున

    జ‌మున మాట్లాడుతూ... శివ‌నాగు నాకు ద‌త్త పుత్రుడు లాంటివాడు. చాలా పెద్ద పెద్ద హీరోల‌తో చేశారు. కృష్ణ‌, చిరంజీవి లాంటి పెద్ద వారితో చేసి ఎన్నోజ‌య‌ప్ర‌ద‌వంత‌మైన చిత్రాల‌ను తీశారు. నేను సినిమారంగం నుంచి త‌ప్పుకుని 30 ఏళ్ళు అయింది. త‌రువాత రాజ‌కీయ‌ల్లోకి వెళ్ళి నాయ‌కురాలిగా కూడా చేశాను. ప్ర‌స్తుతం రిటైర్ అయిన న‌న్ను మ‌ళ్ళీ కెమెరా ముందు నిల‌బెట్టి సినిమా రంగులు వేసి న‌టించేలా చేశారు శివ‌నాగు. అన్న‌పూర్ణ‌మ్మ సినిమాలో నేను న‌టిస్తున్నాను. అందులో ఒక రాణి పాత్ర‌కోసం తీసుకున్నారు. 30 ఏళ్ళ త‌ర్వాత నాకు సినిమా రంగులు పూసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌నత ఆయ‌న‌దే అన్నారు. నేను ఆయ‌న‌లో మెచ్చిన‌ది ఒక‌టే ఆయ‌న విన‌య‌విధేయ గౌర‌వం. ఇక ఈ సినిమా చాలా మంచి క‌థ‌. దేవినేని గారు చేసిన ప్ర‌జాహిత ప‌నులు గురించి చెప్ప‌డం మంచి క‌థ ఇది. ఆయ‌న్ని ప్రోత్స‌హించిన ప్రొడ్యూస‌ర్‌గారికి ఆ పాత్ర‌లో న‌టిస్తున్న తార‌క్‌ర‌త్న‌కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

     నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు: నందమూరి తారక రత్న, నాగినీడు, నాజర్, జయప్రకాష్ రెడ్డి , పృథ్వీ, చల్లా సుబ్రమణ్యం,శివా రెడ్డి,
    శ్రీహర్ష, అజయ్ , బెనర్జీ, జీవా, అన్నపూర్ణమ్మ, సుహాసిని, సుధ ,తేజ ( తొలి పరిచయం) కెమెరా: గిరి కుమార్
    కూర్పు: కె.ఎస్. వాసు,
    కో- డైరక్టర్: కంబాల శ్రీనివాస్,
    పి.ఆర్.ఓ : సాయి సతీష్ ,
    నిర్మాత: రాము రాథోడ్ ,
    కథ-మాటలు- దర్శకత్వం: నర్రా శివ నాగేశ్వరరావు (శివ నాగు).

    English summary
    Vijayawada based politician Devineni Nehru life story getting ready as Devineni Biopic title as Devineni. Bezawada Simham is the tag line. Siva Nagu is the director. C Kalyan clapped for first shot. Senior actor Jamuna attended for this opening shot event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X