30 ఏళ్ల తర్వాత జమున రీఎంట్రీ.. ఫాక్ష్యన్ చిత్రంలో కీలక పాత్ర

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. "దేవినేని" టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై దేవినేని నెహ్రూ బయోపిక్ గా తీస్తొన్న ఈ సినిమాకు రాము రాథోడ్ నిర్మాత. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి, సీనియ‌ర్ ఆర్టిస్ట్ జ‌మున కెమెరాస్విచాన్ చేయ‌గా సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావుగారు ఫ‌స్ట్ షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం ద్వారా మళ్లీ సీనియర్ నటి జమున వెండితెరపై కనిపించడం విశేషం.. వివరాల్లోకి వెళితే..

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నటి జ‌మున మాట్లాడుతూ... శివ‌నాగు నాకు ద‌త్త పుత్రుడు లాంటివాడు. చాలా పెద్ద పెద్ద హీరోల‌తో చేశారు. కృష్ణ‌, చిరంజీవి లాంటి పెద్ద వారితో చేసి ఎన్నోజ‌య‌ప్ర‌ద‌వంత‌మైన చిత్రాల‌ను తీశారు. నేను సినిమారంగం నుంచి త‌ప్పుకుని 30 ఏళ్ళు అయింది. త‌రువాత రాజ‌కీయ‌ల్లోకి వెళ్ళి నాయ‌కురాలిగా కూడా చేశాను. ప్ర‌స్తుతం రిటైర్ అయిన న‌న్ను మ‌ళ్ళీ కెమెరా ముందు నిల‌బెట్టి సినిమా రంగులు వేసి న‌టించేలా చేశారు శివ‌నాగు.

Devineni movie Opening: Senior Actress Jamuna re entry after 30 years

అన్న‌పూర్ణ‌మ్మ సినిమాలో నేను న‌టిస్తున్నాను. అందులో ఒక రాణి పాత్ర‌కోసం తీసుకున్నారు. 30 ఏళ్ళ త‌ర్వాత నాకు సినిమా రంగులు పూసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌నత ఆయ‌న‌దే అన్నారు. నేను ఆయ‌న‌లో మెచ్చిన‌ది ఒక‌టే ఆయ‌న విన‌య‌విధేయ గౌర‌వం. ఇక ఈ సినిమా చాలా మంచి క‌థ‌. దేవినేని గారు చేసిన ప్ర‌జాహిత ప‌నులు గురించి చెప్ప‌డం మంచి క‌థ ఇది. ఆయ‌న్ని ప్రోత్స‌హించిన ప్రొడ్యూస‌ర్‌గారికి ఆ పాత్ర‌లో న‌టిస్తున్న తార‌క్‌ర‌త్న‌కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

Devineni movie Opening: Senior Actress Jamuna re entry after 30 years

తెర ముందు, తెర వెనుక

నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: నందమూరి తారక రత్న, నాగినీడు, నాజర్, జయప్రకాష్ రెడ్డి , పృథ్వీ, చల్లా సుబ్రమణ్యం,శివా రెడ్డి,
శ్రీహర్ష, అజయ్ , బెనర్జీ, జీవా, అన్నపూర్ణమ్మ, సుహాసిని, సుధ ,తేజ ( తొలి పరిచయం) కెమెరా: గిరి కుమార్
కూర్పు: కె.ఎస్. వాసు,
కో- డైరక్టర్: కంబాల శ్రీనివాస్,
పి.ఆర్.ఓ : సాయి సతీష్ ,
నిర్మాత: రాము రాథోడ్ ,
కథ-మాటలు- దర్శకత్వం: నర్రా శివ నాగేశ్వరరావు (శివ నాగు).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X