ఆ ఒక్క మాట చాలు.. ‘చిరు’ సందేశంపై పోలీస్ బాస్.. డీజీపీ ఎమోషనల్ ట్వీట్

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక్క కరోనా విషయమే నడుస్తోంది. ఏ దేశాన్ని చూసినా కరోనా బారిని పడి కొట్టుమిట్టాడుతోంది. విరుగుడు లేని ఈ కరోనాను తరిమికొట్టడానికి ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం కుప్పకూలిపోయింది. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు.. వేలమంది మట్టికరిచారు. మన దేశంలోనూ ఈ కరోనా శర వేగంగా విస్తరిస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు మన ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి.

శర వేగంగా విస్తరిస్తోన్న కరోనా..

శర వేగంగా విస్తరిస్తోన్న కరోనా..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భారతదేశాన్నీ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే మన దేశంలో ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు వందల మంది దాకా దుర్మరణం చెందారు. ఇంతలా విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదని, ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం కోరింది.

పోలీసుల శ్రమ విస్మరించలేనిది..

పోలీసుల శ్రమ విస్మరించలేనిది..

కరోనా లాంటి ఆపత్కర సమయంలో పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంధి చేస్తున్న సేవలను కొనియాడాల్సిందే. ప్రాణాలను లెక్కచేయకుండా కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలను కట్టడి చేయడంలో అపశ్రుతులు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమ కర్తవ్యాన్ని విడనాడటం లేదు. పోలీసుల సేవలను గుర్తించిన సెలెబ్రిటీలు వారికి సెల్యూట్ చేస్తున్నారు.

స్పందించిన చరు..

పోలీసుల సేవలను కొనియాడుతూ.. మహేష్ బాబు, నాగ చైతన్య వీడియో సందేశాలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిరు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎంతో గొప్పగా సేవలందిస్తున్నారని అన్నాడు. కరోనాను ఎదుర్కొనేందుకు నిద్రాహారాలు మాని మన కోసం పని చేస్తున్నారని కొనియాడాడు. వీరు పని చేయడం వల్లే కరోనాను అదుపులో ఉంచగలిగామని, పోలీసులకు సహకరించడం మన బాధ్యతని ప్రజలకు సూచించాడు. ఓ పోలీసు బిడ్డగా.. వీరు చేస్తున్న అమోఘ ప్రయత్నానికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నాడు.

Recommended Video

Balakrishna Donations To CCC and CM Relief Funds, See Chiranjeevi Reaction
డీజీపీ ఎమోషనల్ ట్వీట్..

డీజీపీ ఎమోషనల్ ట్వీట్..

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చిరు సందేశంపై స్పందిస్తూ.. ‘మీరు కేవలం మాలో మాత్రమే స్ఫూర్తిని నింపలేదు.. మొత్తం పోలీసు బలగంలో నింపారు.. అంతేకాకుండా మీ నుంచి స్ఫూర్తి పొందే ప్రజలను కూడా మేల్కొలిపారు. పోలీసు బిడ్డ అంటూ మీరు అన్న ఆ ఒక్క మాట ఎంతో గొప్పది.. కరోనాను ఎదురించే ఈ పోరాటంలో అది మాకు ఎన్నో విధాలుగా సాయపడుతుంది. మీ మాటల వల్ల ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్‌ను విధిగా పాటిస్తార'ని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X