అల్లు అర్జున్ పైనే సెటైర్స్ వేసిన 'ధమాకా' దర్శకుడు.. అత్యుత్సాహం బెడిసి కొట్టిందా?
ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా కూడా భారీ మార్కెట్ ని తెచ్చుకున్న తెలుగు హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరని చెప్పాలి. కాగా ఇపుడు అల్లు అర్జున్ ఇండియా వైడ్ గా అంత స్టార్డం తెచ్చుకున్నప్పటికీ తనకి పర్శనల్ గా పలు ఇబ్బందులు లేకపోలేవు. ఒకపక్క కుటుంబ విషయంలో కానీ ఇంకో పక్క బయట తన సినిమా రిలీజ్ సమయంలో జరిగిన పలు కాంట్రవర్సీలు నడుమ అల్లు అర్జున్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు.
ఇక ఇవి చాలవు అన్నట్టుగా సోషల్ మీడియాలో కూడా తనపై తన చేష్టల రీత్యా గట్టి నెగిటివిటీ కూడా ఉంది. కాగా అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఇచ్చిన స్పీచ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన ఘటన ఎంతలా చర్చకి దారి తీసిందో అందరికీ తెలిసిందే. కాగా ఈ ఘటనపై మరో రకపు స్టోరీలు కొందరు అల్లేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇమిటేట్ చేస్తూ సెటైరికల్ గా మాట్లాడాడు అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది.

కాగా ఆ దర్శకుడు ఎవరో కాదు తెలుగులో సినిమాలో సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, ధమాకా ఇలా పలు వరుస హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రినాధరావు నక్కిన అట. కాగా ఈ దర్శకుడు ఇపుడు యువ హీరో సందీప్ కిషన్ తో మజాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో మన్మథుడు హీరోయిన్ అన్షు సాగర్ పై చేసిన పలు లేకి కామెంట్స్ తనపై విమర్శలు కూడా తీసుకొచ్చాయి.
అయితే అదే స్పీచ్ లో మరో హీరోయిన్ రీతూ వర్మ విషయంలో ఇచ్చిన స్పీచ్ ని సోషల్ మీడియాలో మెగా అభిమానులు మరోలా చిత్రీకరిస్తున్నారు. పుష్ప ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎలా అయితే పేరు మర్చిపోయి ఇతరుల దగ్గర సాయం తీసుకున్నాడో ఇక్కడ కూడా త్రినాథరావు తన సినిమా హీరోయిన్ రీతూ వర్మ పేరుని మర్చిపోయాను అంటూ ఆమెని ఎదురు గానే ఉంచుకొని కామెడీ చేస్తూ మాట్లాడారు.
దీనితో అల్లు అర్జున్ నే ఈ దర్శకుడు ఇమిటేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో సంబంధం లేకపోయినా దానికి దీనికి ఆపాదిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి వాటి మూలాన సోషల్ మీడియాలో తాత్కాలికంగా ఆనందం పొందుతారు ఏమో కానీ ఇలాంటి వాటి మూలాన అనవసరంగా తమ హీరోలకే డ్యామేజ్ తీసుకొచ్చుకుంటున్నారని చెప్పాలి.
మరి ఇలా సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫ్యాన్ వార్స్ అన్నీ హీరోల ఇమేజ్ లనే డ్యామేజ్ చేయడమే కాకుండా వారి సినిమాలకి కూడా ఎఫెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారని చెప్పాలి. ఇక త్రినాథరావు నక్కిన విషయానికి వస్తే తాను తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిబ్రవరి 21న రిలీజ్ కి తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో తాను మరో హిట్ ని ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలి మరి.
Hey I have seen this one this is a classic 😂😂🤣🤣😂😂
— Vamc Krishna (@lyf_a_zindagii) January 12, 2025
Trinadha rao imitates #AlluArjun forgetting Revanth Reddy’s name !! @alluarjun #Mazaaka pic.twitter.com/za3tofzuY3


Click it and Unblock the Notifications