చాహల్‌తో విడాకులు .. తెలుగు కొరియోగ్రాఫర్‌తో రొమాంటిక్‌గా ధనశ్రీ వర్మ
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ , కొరియోగ్రాఫర్ , సినీ నటి ధనశ్రీ వర్మల విడాకుల వ్యవహారం సినీ, క్రీడా రంగాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. విడాకులకు మించి ధనశ్రీ వర్మకు ఇచ్చిన భరణం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెతో సెటిల్ చేసుకున్నారు చాహల్.. దీంతో న్యాయస్థానం వీరిద్దరికీ చట్టప్రకారం విడాకులు మంజూరు చేసింది. నాటి నుంచి ఎవరి దారులు వారివి అయ్యాయి. ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. అయితే తాజాగా ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చర్చనీయాంమయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..
యూట్యూబర్ , కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ధనశ్రీ వర్మ ఫేమస్. ఈ పాపులారిటీతోనే హిందీ రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు . టీమిండియా క్రికెటర్లతో కలిసి గతంలో డ్యాన్స్ చేసిన ధనశ్రీకి చాహల్‌తో పరిచయం ఏర్పడింది. ఇద క్రమంగా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న గురుగ్రామ్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరూ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు చాహల్ - ధనశ్రీ వర్మల వైవాహిక జీవితం సాఫీగా సాగింది.

కానీ అనూహ్యంగా ఈ సెలబ్రెటీ కపుల్ విడిపోతున్నారంటూ ఒక్కసారిగా రూమర్స్ గుప్పుమన్నాయి. వీటి నిజం చేస్తూ చాహల్ - ధనశ్రీలు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత భరణం కింద ధనశ్రీకి రూ.60 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే భార్యకు రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ సెటిల్‌మెంట్ చేసుకున్నాడు.
పరస్పర అంగీకారంతో విడాకులకు సమ్మతించిన కారణంగా 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని చాహల్ - ధనశ్రీలు ముంబై ఫ్యామిలీ కోర్టును కోరారు. అయితే ఈ జంట బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం మార్చి 20న చాహల్ - ధనశ్రీలకు విడాకులు మంజూరు చేస్తూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. విడాకులపై క్లారిటీ రావడంతో చాహల్ ఐపీఎల్‌లో తన జట్టుతో జాయిన్ అయ్యాడు. అతనిని పంజాబ్ కింగ్స్ వేలంలో రూ.18 కోట్లకు దక్కించుకుంది. తన అద్భుత ప్రదర్శనతో జట్టు యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో ప్రశంసలు పొందాడు చాహల్.
ఇకపోతే.. ధనశ్రీ వర్మ విషయానికి వస్తే సినిమాలలో కొరియోగ్రఫీతో బిజీ అయ్యారు. త్వరలోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజ్ బ్యానర్‌లో ఆమె పనిచేయనున్నారని ఫిలింనగర్ టాక్. ఇందుకు అనుగుణంగానే ఇటీవల హైదరాబాద్‌లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యక పూజలు చేయిస్తూ ధనశ్రీ వర్మ కనిపించారు. ఆ తర్వాత షూటింగ్ పాల్గొంటూ దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటోంది. తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులు వేసింది ధనశ్రీ వర్మ. యష్‌తో క్లోజ్‌గా రొమాంటిక్ మూవ్‌మెంట్స్ ఇస్తూ చేసిన ఫోటోషూట్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











