Captain Miller Telugu Release Date: తెలుగులో కెప్టెన్ మిల్లర్ రాబోయేది ఆరోజే!
2024 సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక చిత్రాలు అలరించేందుకు రావాలని ప్లాన్ చేసుకున్నాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలకు థియేటర్లు దొరక్క వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు కూడా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని.. సింగిల్ గా రావాలని ప్లాన్ చేసుకున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే ధనుష్ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉండగా.. తెలుగులో తప్ప మిగతా భాషల్లో విడుదల అయింది. అయితే తాజాగా చిత్ర బృందం తెలుగులో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో ఎప్పుడు విడుదల చేయబోతుందో ప్రకటించింది. ఆ వివరాలు మనం ఇప్పుడు చూద్దాం.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమానే కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా... ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్, జాన్ కొక్కెన్ సహాయక పాత్రల్లో నటించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మించారు. అలాగే జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. సిద్దార్థ నూని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. ఈరోజే ఈ సినిమా విడుదల అయింది.

అయితే సంక్రాంతి పండు సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేసింది. కానీ తెలుగులో పోటీ ఎక్కువ ఉండడంతో ఈ సినిమాకు టిక్కెట్లు దొరకలేదు. దీంతో ఈ సినిమా వాయిదా వేసుకోవడం బెటర్ అని భావించిన చిత్రం బృందం కెప్టెన్ మిల్లర్ ను తెలుగులో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తామో త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఎక్స్ వేధికగా వివరించారు. మాట ప్రకారమే తాజాగా ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు విడుదల చేయబోతున్నారో తెలిపారు.

సంక్రాంతి పండుగకు పోటీ నుంచి తప్పుకున్న ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాబోతున్నట్లు చెప్పేశారు. జనవరి 25వ తేదీన తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా జనవరి 25వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ధనుష్ ఫ్యాన్స్ అంతా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సింగిల్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈరోజే విడుదల అయిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. చూడాలి మరి తెలుగులోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











