ఆస్పత్రిలో ధనుష్ మాజీ భార్య.. ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తా అంటూ షాకింగ్ పోస్ట్

రజనీకాంత్ పెద్ద కూతురు, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన ఐశ్వర్య అందరినీ ఆశ్చర్యానికి కలిగించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇటీవల హఠాత్తుగా ఆసుపత్రిలో దర్శనమివ్వడం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. సడన్ గా అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది. కొంత సీరియస్ గా ఉన్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ తరుణంలో ఐశ్వర్య రజనీకాంత్ వెంటనే సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇస్తూ ఆశ్చర్యకరమైన పోస్టును కూడా పెట్టింది.

విడాకులు తీసుకుంటున్నట్లుగా..

విడాకులు తీసుకుంటున్నట్లుగా..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇటీవల తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గా అధికారికంగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా చాలా సున్నితంగా వివరణ ఇచ్చారు.

ఎంతో అన్యోన్యంగా ఉండే ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కూడా అలా హఠాత్తుగా విడి పోయే సరికి అందరు కూడా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వివరణ ఇచ్చే వరకు కూడా ఎవరికీ ఆ విషయం పై క్లారిటీ రాలేదు.

హాస్పిటల్ లో ఐశ్వర్య

హాస్పిటల్ లో ఐశ్వర్య

ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె గత కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇక పరిస్థితి కాస్త ఇబ్బందిగా అనిపించడం తో ఆమె వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. ఐశ్వర్య అలా హాస్పిటల్లో అడ్మిట్ అవగానే ఆమెపై మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్య ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయింది అన్న విషయం పై సోషల్ మీడియాలో కూడా కొన్ని పుకార్లు హల్ చల్ చేశాయి.

 కరోనా పాజిటివ్

కరోనా పాజిటివ్

అయితే ఆ వార్తల హడావిడి ఎక్కువ కాకముందే ఐశ్వర్య రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దాంతో పాటు ఆమె ఒక విషయాన్ని కూడా చాలా ఘాటుగా తెలియజేయడం విశేషం.

జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ..

జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ..

ఇటీవల కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చిందంటూ తెలియజేసిన ఐశ్వర్య రజనీకాంత్ వెంటనే క్వారంటైన్ లోకి వెళ్ళినట్లుగా ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చింది. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా తనకు కరోనా వైరస్ సోకినట్లు చెబుతూ.. అందరు కూడా ఈ కఠిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కరోనా రాకుండా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి అని ఆమె వివరణ ఇచ్చారు.

Recommended Video

Dadasaheb Phalke Award For Naveen Polishetty & Nagarjuna
 ఐశ్వర్య అప్సెట్..

ఐశ్వర్య అప్సెట్..

అంతేకాకుండా ఐశ్వర్య రజనీకాంత్ పర్సనల్ లైఫ్ లో చాలా అప్సెట్ అయినట్లు కూడా అర్థమవుతుంది.. ఆమె పోస్ట్ చేసిన విధానం లో ఒక ప్రత్యేకమైన లైన్ పలు అనుమానాలను కలుగజేస్తుంది.. 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. దీన్నిబట్టి ఐశ్వర్య రజినీకాంత్ ఇటీవల జరిగిన విడాకుల వివాదంతో కొంత అప్సెట్ అయినట్లు అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X