ఆ సినిమా ‘పుష్ప’కి కాపీనా? ధనుష్ డైరెక్టర్ క్లారిటీ!

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఓం'(OM) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'అమరన్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ వీడియో సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా పలు చర్చలకు దారితీసింది. అసలేం జరిగింది?

'ఓం' సినిమాకి 'చాప్టర్ 1: ఉదిరమ్ - ది బ్లడ్ వుడ్' అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడం ద్వారా ఇది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ అని చిత్రబృందం పరోక్షంగా వెల్లడించింది. కేజీఎఫ్, పుష్ప, సలార్ తరహాలో ఫ్రాంచైజీగా ఈ సినిమాను రూపొందించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Dhanush OM Teaser Sparks Pushpa Comparisons Director Rajkumar Periasamy Reacts

తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో అడవి ప్రాంతం, సాయుధ బలగాలు, అమాయక ప్రజలపై దాడి చేయబోయే దృశ్యాలు కనిపిస్తాయి. అదే సమయంలో చేతిలో గొడ్డలితో ధనుష్ ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అయితే ఈ వీడియోలో కథకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వకుండా దర్శకుడు కావాలనే సస్పెన్స్ కొనసాగించాడు. దీంతో ధనుష్ పాత్ర అసలు స్వరూపం ఏమిటి? అతను ఎవరిని కాపాడుతున్నాడు? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.

అయితే గ్లింప్స్‌లో కనిపించిన ఎర్రచందనం చెట్లు, అడవి నేపథ్యంలో సాగే కథ, ధనుష్ లుక్ కారణంగా చాలామంది ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'తో పోల్చడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో "ఇది మరో పుష్ప కథేనా?", "ధనుష్ కూడా ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడా? పుష్ప సినిమాకు కాపినా? అంటూ చర్చలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తాజాగా స్పందించారు. "మేం ఇప్పటివరకు సినిమాలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూపించాం. 'ఓం'లో ఇంకా చాలా కొత్త అంశాలు ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే నిర్ణయం తీసుకుంటారు. టైటిల్ గ్లింప్స్ విడుదల చేయడం వెనుక ఉద్దేశం కూడా చర్చను సృష్టించడమే" అని తెలిపారు. అయితే 'పుష్ప'తో పోలికలను ఆయన పూర్తిగా ఖండించకపోవడం, అదే సమయంలో ఆ తరహా కథ కాదని స్పష్టం చేయకపోవడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం,'ఓం' కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ కాదని, ఇందులో సామాజిక, రాజకీయ, భావోద్వేగ అంశాలు కూడా కీలకంగా ఉండనున్నాయట. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవి ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితం, వారి పోరాటాలు, అధికార వ్యవస్థల మధ్య జరిగే సంఘర్షణలు ప్రధానాంశాలుగా ఉండే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యంగా రెండు విభిన్న తరాల స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సాయిపల్లవి నటన, శ్రీలీల గ్లామర్, మమ్ముట్టి పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక సంగీత బాధ్యతలను యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల తన సంగీతంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

మరోవైపు ధనుష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో వార్త కూడా కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేయాలని ధనుష్ భావిస్తున్నారని, ఆ బాధ్యతను కూడా రాజ్‌కుమార్ పెరియసామికే అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సినిమా నిజంగానే 'పుష్ప' తరహా కథనా? లేక ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మరో కొత్తసినిమానా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Read more about: dhanush allu arjun pushpa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X