twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhanush’s Sir ధనుష్ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా.. విడుదల తేదీ ఎప్పడంటే?

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సార్. తమిళ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. క్రేజీ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

    సార్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడిస్తూ.. పోస్టర్‌ను రిలీజ్ చేసింది. క్లాస్ రూమ్‌లో స్కూల్ పిల్లల ముందున్న బ్లాక్ బోర్డుపై రాసిన రిలీజ్‌ డేట్‌ను ధనుష్ చూపిస్తున్న ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేసింది.

    Dhanush’s Sir movie release date announced officially, Here is the details

    క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డుపై మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ష్ ఉండగా.. సాధారణ దుస్తుల్లో ధనుష్ కనిపించాడు. డిసెంబర్ 2వ తేదీని గుర్తుంచుకోండి. #SIRMovieOn2ndDec #VaathiOn2ndDec" అంటూ హ్యాష్ ట్యాగ్స్‌ను పోస్టర్‌తోపాటు రిలీజ్ చేశారు.

    తమిళంలో వాతిగా, తెలుగులో సార్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుక్కాలమ్ నరేన్, ఇళవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పెరడి, ప్రవీణి తదితరులు నటిస్తున్నారు. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, నవీన్ నూలీ ఎడిటింగ్, వెంకట్ కొరియోగ్రాఫర్‌గా, అవినాష్ కోళ్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments is joining forces with Sai Soujanya of Fortune Four Cinemas for a bilingual film Sir (Telugu)/Vaathi (Tamil), headlined by national-award winning actor Dhanush. Srikara Studios is presenting the film. Venky Atluri is the writer and director of the prestigious project. Samyuktha Menon plays the female lead. The film will release simultaneously in Telugu and Tamil across the globe on December 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X