ధనుష్ కు 12 గంటలు నరకం.. శేఖర్ కమ్ముల ‘కుబేరా’కు అడుగడుగునా ఆటంకమే.!

తమిళ స్టార్ ధనుష్ తెలుగు ఆడియెన్స్ కు బాగా సుపరిచుడే. '3' మూవీ నుంచి ధనుష్ టాలీవుడ్ లోనూ బాగా క్రేజ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 'రఘువరన్ బీటెక్', 'వీఐపీ', 'అసురన్', 'సార్' వంటి చిత్రాలతో ఎంతో ఆకట్టుకున్నారు. దేశ వ్యాప్తంగానూ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ధనుష్ చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ బాగానే డిమాండ్ ఉంది. ఆయనకు ఇక్కడా ఫ్యాన్స్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబతున్నాయి. 'సార్' చిత్రంతో ధనుష్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఆ చిత్రమే 'కుబేరా'.

శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబోలో వస్తున్న 'కుబేరా'లో కింగ్, అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఏకకాలంలోనే షూటింగ్ జరుగుతుండటం విశేషం. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటిస్తోంది. జిమ్ సర్భ్, దలీప్ తహిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదలై ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరుగుతున్న తరుణంలో ఆటంకాలు కూడా ముంచుకొస్తున్నాయి.

Dhanush showed his Dedication to shot a sequence for 12 Hours Sekhar Kammula Kubera title Controversy

ప్రస్తుతం ఈ చిత్రం టైటిల్ తో చిక్కుల్లో పడింది. పోస్టర్ రీలీజ్ కార్యక్రమాలతోనే టైటిల్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. మొదట టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన సమయంలోనే టైటిల్ కాంట్రవర్సీ మొదలైంది. త్రిశక్తి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ ప్రొడ్యూసర్ నరేంద్ర, కో ప్రొడ్యూసర్ శేఖర్ కమ్ముల, ధనుష్ పై ఇప్పటికే చలన చిత్ర మండలిలో ఫిర్యాదు చేశారు. 2023లోనే 'కుబేరా' టైటిల్ ను ఐదు లాంగ్వేజీల్లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. 22 నవంబర్ 2023న అఫ్రూవల్ కూడా వచ్చిందని, ఆ వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశామని నరేంద్ర చెప్పారు.

కానీ కొన్ని నెలలకే మార్చి 8, 2024న శేఖర్ కమ్ముల 'కుబేరా' అని ఫస్ట్ లుక్ విడుదల చేసి షాక్ ఇచ్చారని ప్రెస్ మీట్ నిర్వహించి వివరించిన సంగతి తెలిసిందే. తమ టైటిల్ ను వాడుకోవద్దని, వాడుకుంటే బడ్జెట్ లో షేర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలిలో ఉన్న వారు తమకు న్యాయం చేయాలని, ఇప్పటికే 'కుబేరా' టైటిల్ తో 90శాతం మేర షూటింగ్ కూడా పూర్తి చేశామన్నారు. కానీ శేఖర్ కమ్ముల గారు ఇలా చేయడం బాలేదన్నారు.

మరోవైపు గతంలోనూ ఈ చిత్రంపై ఓ కేసు నమోదైంది. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రశాతంగా జరిగింది. కానీ రెండో షెడ్యూల్ తో యూనిట్ సమస్యలు ఎదుర్కొంది. తిరుపతితో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. తిరుపతిలోని అలిపిరి నుంచి మెట్ల మార్గంలో షూట్ చేశారు. షూటింగ్ కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు షూటింగ్ కు అభ్యంతరం తెలపడమే కాకుండా కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత బ్యాంకాక్, ముంబైలో మిగితా షూటింగ్ జరిగింది. అలాగే గతంలో పోస్టర్ రిలీజ్ సమయంలో టైటిల్ వివాదం యూనిట్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో మళ్లీ టైటిల్ కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది.

Dhanush showed his Dedication to shot a sequence for 12 Hours Sekhar Kammula Kubera title Controversy

ఇక ఇదిలా ఉంటే... ధనుష్ 'కుబేరా' చిత్రం కోసం ఎంతో డెడికేషన్ చూపించారు. ఒక్క సీన్ కోసం 12 గంటలు నరకం చూశాడంట. ముంబైలో షెడ్యూల్ లో సీక్వెన్స్ షూట్ చేస్తున్న సందర్భంగా 12 గంటలకు పైగా ధనుష్ డంప్ యార్డులోనే భరించలేని దుర్వాసనను తట్టుకుని ఉన్నారంట. సినిమా కోసం ధనుష్ ఎంత కష్టపడుతున్నారో ఇదొక్క ఉదాహరణ చాలు. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్ కు సహకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X