టాలీవుడ్‌లో కలకలం.. స్టార్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసు.. పరారీలో మాస్టర్

తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గతేడాది టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆరోపణలు రావడం భారతీయ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రేష్టి వర్మ అనే లేడీ కొరియోగ్రాఫర్ ఏకంగా జానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకు ముందే జానీ మాస్టర్ పరార్ కావడంతో పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. దాంతో ఆయనకు కోర్ట్ రిమాండ్ విధించడంతో జానీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

జానీ మాస్టర్‌పై కేసు
లైంగిక వేధింపుల నేపథ్యంతో జానీ మాస్టర్‌ నేషనల్ అవార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, బెయిల్, తిరిగి ఆయన కొరియోగ్రాఫర్‌గా బిజీ కావడం చకచకా జరిగిపోయాయి. జానీ మాస్టర్ ఎదుగుదలను ఓర్చుకోలేక కొందరు కుట్ర చేసి ఆయన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్ ఎంతో కష్టపడి ఈస్థాయికి చేరుకున్నారని.. సహచర కొరియోగ్రాఫర్లు కూడా మద్ధతుగా నిలబడ్డారు. ఏడాది కావొస్తున్నా జానీ మాస్టర్ వ్యవహారంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

Dhee Fame Choreographer Krishna Master arrested in pocso case

టాలీవుడ్‌లో సంచలనంగా జానీ మాస్టర్ కేసు
ఈ కేసులో బాధితురాలిగా ఉన్న శ్రేష్టి వర్మ అసిస్టెంట్ నుంచి స్వయంగా సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వచ్చింది. జానీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. జానీ మాస్టర్ వ్యవహారం సద్దుమణగడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. అయితే తాజాగా టాలీవుడ్‌కే చెందిన మరో స్టార్ కొరియోగ్రాఫర్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

కృష్ణ మాస్టర్‌పై పోక్సో కేసు
ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఢీ అనే డ్యాన్స్ రియాలిటీ షోతో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ తమ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గత నెలలో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మాస్టర్ వెంటనే పరారీలోకి వెళ్లిపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. బెంగళూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అనంతరం కృష్ణ మాస్టర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

బెంగళూరుకు పారిపోయిన కృష్ణ మాస్టర్‌
ఆపై కోర్టులో హాజరుపరచగా కృష్ణ మాస్టర్‌కు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో అతనిని కంది జైలుకు తరలించారు. అయితే కృష్ణ మాస్టర్‌పై గతంలోనూ ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని పలువురు యువతుల్ని మోసం చేసినట్లుగా ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇటీవలే కృష్ణకు ఓ మహిళతో వివాహం జరగ్గా.. భార్యకు చెందిన 10 లక్షల రూపాయల నగదుతో బెంగళూరు పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది జానీ మాస్టర్ ఎపిసోడ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయింది. తాజాగా కృష్ణ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: tollywood news jani master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X