హాట్ నెస్ ఓవర్‌లోడెడ్ : పొట్టి బట్టలతో హారిక రచ్చ.. బ్లాక్ డ్రెస్ తో స్టెప్స్ వేసి చంపేస్తోంది!

అలేఖ్య హారిక అనే అచ్చమైన తెలంగాణ పోరి యూట్యూబ్‌ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. వెబిసోడ్స్ లో తనదైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ హారిక విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక్కడ లభించిన క్రేజ్ తో బిగ్ బాస్ 4 ఫైనల్ దాకా వెళ్లింది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక తాజాగా రెండు డాన్స్ వీడియోస్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. పొట్టి బట్టలు వేసుకుని ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వివరాల్లోకి వెళితే

జాబ్ వదిలేసి మరీ

జాబ్ వదిలేసి మరీ

అందరిలాగే చదువుకుని అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించిన హారిక తనకు ఉద్యోగం సరిపోదని త్వరగానే అర్థం చేసుకుంది. నటన మీద ఉన్న ఆసక్తితో ఏమి చేయాలో తెలియక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది. అలా ప్రస్తుతం హారిక చేసే 'దేత్తడి' యూట్యూబ్ చానెల్‌కు లక్షల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా ఆమెకు విపరీతమైన క్రేజ్ దక్కింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ ఫోర్ లో అవకాశం వచ్చింది.

సైలెంట్ మాత్రమే కాదు వైలెంట్ కూడా

సైలెంట్ మాత్రమే కాదు వైలెంట్ కూడా

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన హారిక తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక నేటి ఆధునిక యువతి ఎలా ఉండాలో అలాగే ఉండే హారిక ఎంత సైలెంట్ గా కనిపిస్తుందో అవసరం వచ్చినప్పుడు అంతే వైలెంట్ గా మారుతుంది. ఈ విషయం బిగ్ బాస్ హౌస్ లో ఉండగా చాలాసార్లు నిరూపితమైంది కూడా. మామూలు సమయాల్లో చాలా బాగుంది ఆమె ఏదైనా గొడవలు జరిగితే మాత్రం ఆమె వైలెంట్ అయ్యేది.

అభిజిత్ తో ప్రేమాయణం

అభిజిత్ తో ప్రేమాయణం

ఇక హౌస్ లోపల ఉండగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ హారిక ప్రేమాయణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బయట ఉన్న హారిక తల్లి అభిజిత్ తల్లి కూడా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ వాళ్ళిద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే హారిక తనకు చెల్లెలు లాంటిదని హౌస్ లో కూడా చాలాసార్లు చెల్లి అని ప్రస్తావించానని అభిజిత్ తెలపడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత క్రేజ్

మరింత క్రేజ్

అయితే బిగ్ బాస్ లో ఫినాలే వరకు వెళ్లిన దేత్తడి హారిక చివరిలో మాత్రం వెనక్కి వచ్చే ఇక తప్పలేదు. ఆమె ఐదు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితేనేమి ఈ షో ద్వారా లభించిన రెమ్యూనరేషన్ మాత్రమే కాక ఈ షో ద్వారా ఆమె మరింత మందికి చేరువ అయ్యింది అనేది కాదనలేని వాస్తవం.. ఈ షో నుంచి బయటకు వచ్చాక ఆమె శ్రీకారం అనే సినిమా కూడా చేయగా ఈ సినిమా కూడా ఈ మధ్యన రిలీజ్ అయింది.

అందుకే సినిమాలు ఒప్పుకోకుండా

అందుకే సినిమాలు ఒప్పుకోకుండా

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన దేత్తడి హారిక మళ్ళీ ఎప్పటిలాగే తన ఛానల్ ద్వారా వీడియోలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ మధ్యలో ఏమండోయ్ ఓనర్ గారు అని ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మూడు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఈమెకు సినిమా అవకాశాలు కూడా దండిగానే వస్తున్నాయి, కానీ చాలా సెలెక్టివ్ గా పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమె సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

హాట్ నెస్ ఓవర్ లోడెడ్

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో టచ్ లోనే ఉంటుంది.. ప్రతి రోజూ ఏదో ఒక రకమైన ఫోటో లేదా వీడియో రిలీజ్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది.. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఒక హాట్ డాన్స్ వీడియో షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆమె ఎప్పటిలాగే పొట్టి బట్టలతో దర్శనమిచ్చింది. ఒక హిందీ సాంగ్ కి డాన్స్ వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X