చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్న విక్రమ్ కొడుకు.. రెమ్యునరేషన్ ఏంచేశాడంటే!
విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో వర్మగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ధృవ్ కు ఇదే తొలి చిత్రం. అర్జున్ రెడ్డి తెలుగులో ఘన విజయం సాధించడంతో విక్రమ్ తన తనయుడికి ఇదే సరైన డెబ్యూ మూవీ అని భావించాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
తొలి చిత్రానికి అందుకున్న పారితోషకం ఏ నటుడికైనా మధుర జ్ఞాపకం. తన తొలి సినిమా రెమ్యునరేషన్ ని ధృవ్ ఓ మంచి పనికి ఉపయోగించాడు. ఇటీవల కేరళ వరదలతో నష్టపోయిన వారి కోసం తన పారితోషకాన్ని విరాళంగా ప్రకటించాడు. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ ని కలసి చెక్ అందజేశాడు.

చిన్నవయసులోనే పెద్ద మనసు చాటుకున్న ధృవ్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. చాలా మంది సినీతారలు తమకు తోచిన విధంగా కేరళ వరద భాదితుల కోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ చిత్రం బాల దర్శత్వంలో రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











