Dhruva Natchathiram First Review విక్రమ్, గౌతమ్ మీనన్ అదుర్స్.. ప్రముఖ డైరెక్టర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, గౌతమ్ వాసుదేవన్ మీనన్ కాంబినేషన్‌లో రూపొందిన ధృవ నక్షత్రం సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్దమైంది. రీతూవర్మ, రాధిక శరత్ కుమార్, సిమ్రాన్, వినయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా లీగల్ సమస్యల నుంచి గట్టెక్కడంతో విడుదలకు ముస్తాబైంది. గౌతమ్ మీనన్ నిర్మాతగా మారిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫిని అందించిన మూవీ నవంబర్ 24వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా గురించి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ వివరాల్లోకి వెళితే..
ధ్రువనక్షత్రం సినిమా 2017 సంవత్సరంలో మొదలైంది. అయితే చట్టపరమైన, న్యాయపరమైన చిక్కుల్లోను, అలాగే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నది. ఈ సినిమాకు ఈ సమస్యలు తొలగిపోవడంతో నవంబర్ 24వ తేదీన రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు.

ధ్రువనక్షత్రం సినిమాను ముంబైలో చూసిన కొందరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన దర్శకుడు లింగుస్వామి ట్విట్టర్‌లో తన రివ్యూను పోస్టు చేసి దర్శక, నిర్మాత గౌతమ్ మీనన్‌ను అభినందించారు. ప్రస్తుతం లింగుస్వామి పోస్టు వైరల్‌గా మారింది.
లింగుస్వామి ట్విట్టర్‌లో పోస్టు పెడుతూ ధృవనక్షత్రం సినిమా ఫైనల్ కట్ చూశాను. ముంబైలో ఈ సినిమా చూసిన తర్వాత నాకు గొప్ప అనుభూతి కలిగింది. ఈ సినిమా ఫెంటాస్టిక్. విజువల్ పరంగా అద్బుతంగా ఉంది. చియాన్ విక్రమ్ చాలా కూల్‌గా కనిపించారు. వినాయకన్ సినిమాలో సూపర్‌గా నటించారు. భారీ తారాగణంతో రూపొందించారు. ప్రతీ ఒక్కరు కూడా బ్రిల్లియెంట్‌గా ఫెర్ఫార్మ్ చేశారు అని లింగుస్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ధృవనక్షత్రం సినిమాను అద్బుతంగా రూపొందించిన నా సోదరుడు గౌతమ్ మీనన్‌కు కంగ్రాట్స్. అలాగే మంచి మ్యూజిక్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిన హ్యారీస్ జయరాజ్ నా అభినందనలు. గొప్పగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులందరికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకొంటున్నాను అని లింగుస్వామి తన పోస్టులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











