IMDb లిస్ట్‌లో ధురంధర్ 2 హవా.. టాప్‌ 1లో ఆదిత్యధర్..ఎవరెవరు ఏ స్థానంలో?

IMDb India: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సినీ డేటాబేస్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb). ఈ సంస్థ ఈ వారానికి సంబంధించిన 'మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాను తాజాగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు చేసే సెర్చ్‌లు, పేజీ వ్యూస్, ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ రూపొందించబడతాయి. సాధారణంగా ఈ జాబితాలో నటీనటులే అగ్రస్థానాల్లో నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడింది. ఈ జాబితాలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్(Dhurandhar 2) హవా చూపించింది. అయితే, ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే?

ధురంధర్ 2 సినిమా ఇండియన్ సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గత రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎఫెక్ట్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో కూడా స్పష్టంగా కనిపించింది. తాజాగా విడుదలైన IMDb 'మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో ఈ సినిమా టీమ్ కూడా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ జాబితాలో అగ్రస్థానం సాధించినది ఎవరో కాదు.. ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar). సాధారణంగా నటీనటులు ఆధిపత్యం చెలాయించే ఈ ర్యాంకింగ్స్‌లో ఓ డైరెక్టర్ నంబర్ 1 స్థానం దక్కించుకోవడం విశేషం.

Dhurandhar 2 Dominates IMDb India List Aditya Dhar Tops Popular Celebrities Chart

'ధురంధర్: ది రివెంజ్' సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు, కథను హై వోల్టేజ్ నెరేషన్‌తో అందించిన విధానం, భారీ విజువల్స్-అన్నీ కలిసి ఆయనకు ఈ గుర్తింపు తెచ్చిపెట్టాయి. సినిమా సక్సెస్ ఎంతటి చూపుతుందో ఈ ర్యాంకింగ్ ప్రభావం స్పష్టంగా చూపిస్తోంది. ఇక రెండో స్థానంలో నిలిచింది యువ నటి సారా అర్జున్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు హీరోయిన్‌గా తన సత్తా చాటుతూ ఈ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించింది. 'యాలీనా' పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాపులారిటీ కారణంగానే IMDb జాబితాలో నంబర్ 2 లభించింది.

ఇక 3 వ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నిలిచారు. ఈ సినిమాలో తన ఎనర్జిటిక్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అండర్‌కవర్ ఏజెంట్‌గా అతని పాత్రకు ప్రధాన బలం. సినిమా సక్సెస్‌తో పాటు అతని స్టార్ పవర్ కూడా ఈ ర్యాంకింగ్‌లో ప్రతిఫలించింది. అంతేకాదు, ఈ జాబితాలో 'ధురంధర్ 2' టీమ్‌కు చెందిన మరికొందరు నటినటులు కూడా టాప్ 20లో చోటు సంపాదించడం విశేషం.

ఇక నాలుగో స్థానంలో చిత్రాంగద సింగ్ నిలవడం కూడా విశేషం. 'మాతృభూమి' చిత్రం నుంచి విడుదలైన 'చాంద్ దేఖ్ లేనా' పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ర్యాంక్ 120 నుంచి నేరుగా 4వ స్థానంలో నిలిచారు. ఇక 15వ స్థానంలో మల్లికా ప్రసాద్ నిలిచింది. 'మర్దానీ 3' ఓటీటీ రిలీజ్ కారణంగా ఆమెకు భారీగా సెర్చ్‌లు పెరగడంతో 384వ స్థానం నుంచి 15వ స్థానానికి చేరుకుంది.

ఇక సువిందర్ విక్కీ 18వ స్థానంలో నిలిచాడు. 'ధురంధర్ 2'లో అతని నటనతో పాటు రాబోయే 'స్టార్మ్' ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కారణంగా అతను ట్రెండ్ అయ్యాడు. అలాగే.. సౌత్ నుంచి విజయ్ సేతుపతి కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కించున్నారు. సేతుపతి ఈ లిస్ట్ లో 24వ స్థానంలో నిలిచాడు. 'కాట్టాన్' సినిమాలో 'ముత్తు' పాత్రలో అతని నటనకు ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.

ఇక ధురంధర్ మూవీలో మరో నటుడు డానిష్ పాండోర్ 25వ స్థానంలో నిలిచాడు. ధురంధర్ 2లో అతని పాత్రకు మంచి స్పందన రావడంతో ఈ స్థానం దక్కింది. గతంలో 68వ స్థానంలో ఉన్న దివ్యా దత్తా 36వ స్థానానికి ఎగబాగాడు. ఇక ఇదే సినిమాలో నటించిన నటుడు మానవ్ గోహిల్ 38వ స్థానంలో నిలిచాడు. ఇక జానకి బోడివాలా 'మర్దానీ 3' ఓటీటీ రిలీజ్‌తో ఆమె ర్యాంక్ 367 నుంచి 41కి ఎగబాకింది. ఇక డైరెక్టర్ కెన్ కరుణాస్ 47వ స్థానంలో నిలిచాడు. అతను దర్శకత్వం వహించిన 'యూత్' చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ ర్యాంక్ సాధించాడు.

IMDb ఈ జాబితాను ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా యూజర్ల సెర్చ్‌లు, పేజీ వీక్షణలు, ఎంగేజ్‌మెంట్ ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి ఈ ర్యాంకింగ్స్ కేవలం ఇండియన్ మార్కెట్‌కే పరిమితం కాకుండా, గ్లోబల్ లెవెల్‌లో ఎవరు ట్రెండ్ అవుతున్నారో చూపిస్తాయి. ఈ 'ధురంధర్: ది రివెంజ్' సినిమా ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా ఈ వారం IMDb ర్యాంకింగ్స్ తో ధురంధర్ 2 మూవీకి ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాదు, గ్లోబల్ ఎలాంటి గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో ఈ హవా ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి.

Read more about: imdb ranveer singh aditya dhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X