Ranveer Singh: ధురంధర్ 2 హీరోకి చేదు అనుభవం... రణ్‌వీర్‌ సింగ్‌కి హీరోయిన్ చెంపదెబ్బ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ధురంధర్ 2. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంతో పాటు సరికొత్త లెక్కలు సృష్టిస్తోంది. ఈసారి ఖచ్చితంగా 2000 కోట్ల కలెక్షన్స్ మార్క్ క్రాస్ చేసి చూపిస్తామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్‌వీర్ సింగ్ సహా ధురంధర్ చిత్ర యూనిట్‌పై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధురంధర్ 2 థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో రణ్‌వీర్ సింగ్‌కు ఊహించని ఘటన ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 Hero Ranveer Singh Slapped by Saumya Tandon at Success Party Fun Video Goes Viral

భారీ వసూళ్లతో ధురంధర్ 2 రికార్డ్
తొలిరోజు ఇండియాలో 175 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 70 కోట్ల రూపాయలతో కలిపి ఏకంగా 240 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది ధురంధర్ 2. రణ్‌వీర్ స్పీడు చూస్తుంటే ఈ వీకెండ్ ముగిసేసరికి 500 కోట్ల మార్క్‌ను ఛేదిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో రోజు కూడా ధురంధర్ 2 ఊపు ఏమాత్రం తగ్గడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు రణ్‌వీర్ మూవీ ఇండియాలో ఏకంగా 38 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు ధురంధర్ 2 మూవీ వరల్డ్ వైడ్‌గా 85 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా రెండ్రోజుల్లోనే ఈ సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవచ్చని ఊహిస్తున్నారు.

ధురంధర్ హీరోకి చేదు అనుభవం
ధురంధర్ 2 మూవీ ఊహించిన దానికంటే ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. అయితే హీరో రణ్‌వీర్ సింగ్‌కు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. ఓ స్టార్ హీరోయిన్ ఆయనను పబ్లిక్‌గా చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది నిజంగా కాదు.. ఫన్నీగా. ధురంధర్ 2లో రెహమాన్ డెకాయిత్‌గా అక్షయ్ ఖన్నా, ఆయన భార్య ఉల్ఫత్ పాత్రలో సౌమ్య టాండన్ నటించారు. సినిమాలో కథను మలుపు తిప్పే ఓ సన్నివేశం ఉంది. తన భర్త రెహమాన్ మరణానికి హంజా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) కారణమని ఉల్ఫత్ పాత్ర తెలుసుకుంటుంది.

రణ్‌వీర్‌ను కొట్టిన స్టార్ హీరోయిన్
దాంతో అందరి ముందే హంజా అలీ మజారీని ఉల్ఫత్ పాత్ర పోషిస్తున్న సౌమ్య టాండన్ కొడుతుంది. ఈ సీన్ సినిమాలో చాలా కీలకం. బలమైన భావోద్వేగాలు, దేశభక్తి, భార్యాభర్తల అనుబంధం అన్ని ఒకేసారి ఈ సన్నివేశంలో కనిపిస్తాయి. ప్రేక్షకులు కూడా ఈ సీన్‌కు బాగా కనెక్ట్ అయినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ధురంధర్ 2 సక్సెస్ పార్టీలో ఎంజాయ్ చేసిన చిత్ర యూనిట్.. హంజాను ఉల్ఫత్ చెంపదెబ్బ కొట్టే సీన్ రీ క్రియేట్ చేయాల్సిందిగా కోరారు. దాంతో రణ్‌వీర్‌ను సౌమ్యా టాండన్ లాగిపెట్టి కొట్టారు. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఆమె చెంపదెబ్బకు సరదాగా రియాక్ట్ అయ్యారు రణ్‌వీర్. ఆ తర్వాత చిత్ర యూనిట్‌ అంతా సెల్పీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సౌమ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ధురంధర్ టీమ్‌లో తనకు అవకాశం కల్పించి చరిత్రలో భాగం కల్పించినందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు సౌమ్య ధన్యవాదాలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X