Dhurandhar 2: రిలీజ్‌కి ముందే చిక్కుల్లో.. బ్లాక్ లిస్టులో ధురంధర్ నిర్మాత..

Dhurandhar 2: ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి స్పై థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ డ్రామా 'ధురంధ‌ర్‌'. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసింది. ఎవరూ ఊహించిన విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది. అయితే.. ఈ సినిమా విడుదలకు ముందు చిక్కుల్లో పడిందట. ఇంతకీ ఏం జరిగిందంటే..?

భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ధురంధర్ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద షాక్‌గా మారాయి.

Dhurandhar 2 in Trouble Before Release BMC Moves to Blacklist Aditya Dhar s B62 Studios

దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ప్రాంతంలో కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. ఈ సమయంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. హెరిటేజ్ జోన్‌గా గుర్తింపు పొందిన ఈ పాంత్రంలో అగ్ని వినియోగం, క్రాకర్లు, ఫ్లామబుల్ పదార్థాల వాడకంపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ మూవీ మేకర్స్ పోలీసు అనుమతి లేకుండా మండే టార్చ్‌లు ఉపయోగించడం, రాత్రి ఆలస్యంగా షూటింగ్ కొనసాగించడం, భవనాల పైకప్పులపై అనుమతి లేకుండా షూటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే.. జనరేటర్ వాన్‌లను అనధికారికంగా వినియోగించడం, ముందస్తు అనుమతి లేకుండా లొకేషన్ మార్పులు చేయడం కూడా ఉల్లంఘనల జాబితాలో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలపై హెచ్చరికలు, జరిమానాలు విధించినప్పటికీ మళ్లీ అదే తప్పులు పునరావృతం కావడంతో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య ధర్‌కు చెందిన B62 స్టూడియోస్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేయాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) ప్రతిపాదించింది.

అలాగే రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను ఫోర్ఫిట్ చేయడం, రూ.1 లక్ష జరిమానా విధించడం, భవిష్యత్తులో మహారాష్ట్ర ఫిల్మ్ అండ్ స్టేజ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా షూటింగ్ పర్మిషన్లకు అనర్హులుగా ప్రకటించడం వంటి చర్యలను సూచించింది. ఈ ప్రతిపాదనకు సంబంధిత ఉన్నతాధికారుల ఆమోదం లభించినట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే ముంబై నగరంలో భవిష్యత్తులో B62 స్టూడియోస్‌కు ప్రభుత్వ అనుమతులతో లొకేషన్లు బుక్ చేసుకునే అవకాశం దాదాపు లేకుండా పోతుంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎదుగుతున్న ఈ బ్యానర్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశముంది.

ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు ముంబై కీలక హబ్ కావడంతో ఈ నిర్ణయం వారి భవిష్యత్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా 'ధురంధర్ 2: ది రివెంజ్' మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్‌పై ప్రభావం చూపుతుందా? ప్రభావం పడితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి భాగం భారీ విజయంతో ఇప్పటికే అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఈ వివాదం చిత్రంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా లేదా అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X