Dhurandhar 2: ధురంధర్ 2 పై మహేశ్ బాబు, ఎన్టీఆర్ రివ్యూ.. రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు..
Dhurandhar 2: మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కావడం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు సృష్టించిన ఈ సినిమా, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రీమియర్ షోలు వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం మరింత హైప్‌ను తీసుకొచ్చింది.ఈ వివరాల్లోకి వెళితే..

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌లపై దర్శకుడు ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించిన భారీ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2). ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ హీరో హీరోయిన్లుగా నటించగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, శివకుమార్ వి పానికర్ ఎడిటింగ్‌ను అందించారు.
సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రతి సన్నివేశానికి అదనపు ఉత్కంఠను తీసుకొచ్చాడు.గతంలో విడుదలైన 'ధురంధర్ 1' కేవలం హిందీ భాషలోనే విడుదల చేసిన మేకర్స్, ఈ సారి దాని సీక్వెల్ అయిన 'ధురంధర్ 2'ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేసి, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు. దీంతో ఈ మూవీ దేశవ్యాప్తంగా ఊహించని విధంగా భారీ స్పందనను అందుకుంటుంది.
ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ధురంధర్ 2 సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. తారక్ తన రివ్యూలో ముందుగా హీరో రణ్ వీర్ సింగ్ నటనను ప్రశంసిస్తూ.. 'అతను కేవలం నటించలేదు... స్క్రీన్‌పై మాస్టర్‌క్లాస్ ఇచ్చాడు' అని కొనియాడాడు. ప్రతి సీన్‌లో తన ఎనర్జీ, ఇంటెన్సిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని తెలిపాడు. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి భారీ సినిమాను తెరకెక్కించడానికి కావాల్సిన ధైర్యం, విజన్ ఆయనలో ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఫ్రేమ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో దర్శకుడి కృషి స్పష్టంగా కనిపిస్తుందని, సినిమాకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందేనని తారక్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఆర్. మాధవన్ నటనను 'ఎఫర్ట్‌లెస్' అని ప్రశంసించిన తారక్, ఆయన కనిపించే ప్రతి సీన్‌లో ఆధిపత్యం చాటారని చెప్పాడు. అలాగే సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్ లేయర్డ్ పెర్ఫార్మెన్స్‌లతో సినిమాకు బలం చేకూర్చారని పేర్కొన్నాడు. ఇక సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ గురించి ప్రస్తావిస్తూ.. 'ప్రతి సీన్‌ను,ఎలివేట్ చేస్తూ అడ్రినలిన్ పెంచింది' అని అభినందించాడు. 'ధురంధర్: ది రివెంజ్' కేవలం ఒక సినిమా కాదు... ప్రేక్షకుల భావోద్వేగాలను కదిలించే అనుభవం. క్లైమాక్స్ తర్వాత కూడా మనసులో నిలిచిపోయే కథ, ప్రదర్శనలు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పొచ్చు.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ధురంధర్ 2 మన రివ్యూ ఇచ్చారు. 'పర్ఫెక్ట్ ప్రిసిషన్‌తో ఎగ్జిక్యూట్ చేసిన ఎక్స్‌ప్లోషన్ మూవీ'గా అభివర్ణించారు. ముఖ్యంగా హీరో రన్ వీర్ సింగ్ నటన గురించి మాట్లాడుతూ, 'ఇది అతని కెరీర్‌లోనే ఫైనెస్ట్ వెర్షన్' అని ప్రశంసించారు. ప్రతి సీన్‌లో తన ఎనర్జీ, ఇంటెన్సిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు. ఇక దర్శకుడు ఆదిత్య థర్ కథను పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో తెరకెక్కించి, ప్రతి సీన్‌ను ఇంటెన్స్‌గా ప్రెజెంట్ చేశారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్‌గా సాగుతూ ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని ఎనర్జీ, యాక్షన్ సీక్వెన్స్‌ల్లో చూపిన ఇంటెన్సిటీ సినిమాకు ప్రధాన బలమని చెప్పారు.
అలాగే ఆర్. మాధవన్ తన పాత్రతో ఎమోషనల్ డెప్త్‌ను జోడించి మెప్పించాడు. సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో పెద్ద ప్లస్. యాక్షన్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తూ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచింది.మొత్తంగా ధురంధర్: ది రివెంజ్ ఒక స్టైలిష్, పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ. మహేష్ బాబు చెప్పినట్టే ఇది కేవలం చూడాల్సిన సినిమా కాదు... థియేటర్‌లో సెలబ్రేట్ చేయాల్సిన మూవీ అన్నారు. ఈ సినిమాకు మహేశ్ బాబు 4 స్టార్స్ ఇచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ధురంధర్ 2 మూవీపై తన రివ్యూ ఇచ్చారు. దర్శకుడు ఆదిత్య థర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తనను ఎంతో ఎమోషనల్‌గా టచ్ చేసిందని, దేశభక్తిని స్టైలిష్‌గా, అంతర్జాతీయ స్థాయిలో చూపించడం అద్భుతమని అన్నారు. రణ్ వీర్ సింగ్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్న బన్నీ, ఆయనను 'మై బ్రదర్' అంటూ సంబోధిస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా కొనియాడారు. రణ్‌వీర్ ఎనర్జీ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని తెలిపారు.
అలాగే సీనియర్ నటుడు ఆర్. మాధవన్ సహా అందరూ నటీనటులు అద్భుతంగా నటించారని చెప్పారు. మొత్తంగా దురంధర్ 2 ఒక 'షో రాకర్' అని పేర్కొన్నారు అల్లు అర్జున్. అలాగే.. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా రిచ్‌గా ఉందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్న స్వచ్ఛమైన భారతీయ కథ అని చెప్పుతూ "జై హింద్" అంటూ తన రివ్యూను ముగించారు.



Click it and Unblock the Notifications
















