‘ధురంధర్ 2' ట్రైలర్ డేట్ వచ్చేసింది.. ఆ రూమర్స్ కి కూడా చెక్..

Dhurandhar The Revenge: బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2 (Dhurandhar:The Revenge)'. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇట్టే వైరలవుతోంది. ఎందుకంటే.. గతంలో బాక్సాఫీస్‌ను ఊపేసిన ధురంధర్ (Dhurandhar) సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఈ భారీ బడ్జెట్ మూవీ మూవీ విడుదలపై పలు రూమర్స్ వచ్చాయి. ఈ రూమార్స్ అన్నింటికి చెక్ పెడుతూ మూవీ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటీ?

'ధురంధర్' స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా 'ధురంధర్: ది రివేంజ్' (Dhurandhar The Revenge) సిద్ధమైంది.ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా నటిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు.

Dhurandhar The Revenge Trailer Date Out Makers Silence Delay Rumors Ahead of March 19 Release

ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం
మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం 'ధురంధర్: ది రివెంజ్' ట్రైలర్‌ను మార్చి 7న ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రైలర్ ద్వారా ఈ భారీ యాక్షన్ డ్రామాలోని అసలు స్థాయిని చూపించబోతున్నారని మేకర్స్ సంకేతాలు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పలు రకాల రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు మేకర్స్ అధికారికంగా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఆ రూమర్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది.

పాన్ ఇండియా రిలీజ్
ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు. మార్చి 19, 2026న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని జియో స్టూడియో, బీ62 స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధురంధర్ 1 ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో టాప్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, స్పై థ్రిల్లర్ కథ, ప్రతీకారం ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం కంటే మరింత భారీ స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'హోంస్లా... ఇంధన్... బద్లా' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ అనుభూతిని అందించనుందని మేకర్స్ పేర్కొంటున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మార్చి 7న విడుదల కానున్న ట్రైలర్‌పైనే ఉంది. సుమారు 3 గంటల 55 నిమిషాల నిడివితో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X