Dhurandhar: జపాన్‌లో అట్టహాసంగా దురంధర్ మూవీ రిలీజ్.. RRR బాక్సాఫీస్ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన ధురంధర్ మరోసారి విశ్వ వేదికలపై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా తన బాక్సాఫీస్ జర్నీ కొనసాగించేలా జపాన్ దేశంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి భారతీయ ప్రేక్షకులు వసూళ్ల రూపంలో బ్రహ్మరథం పట్టారు. ఇక విదేశీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని నింపేందుకు చిత్ర యూనిట్ జపాన్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా జపాన్ రిలీజ్‌ గురించి హీరో రణ్‌వీర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ సినిమా బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్‌లో బారతీయ సైన్యానికి చెందిన సీక్రెట్ ఏజెంట్ జీవిత కథకు కొన్ని ఊహాతీత కథనాలు, కొన్ని వాస్తవాలను జోడించి దర్శకుడు ఆదిత్య ధార్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా పార్ట్ 1కు ఊహించని విధంగా ఆదరణ లభించింది. ఈ చిత్రం పార్ట్ 1 సుమారుగా 1428 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Dhurandhar s Japan Release date

దురంధర్ తొలి భాగంలోని కంటెంట్‌కు ఆదరణ లభించడంతో సెకండ్ పార్ట్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. దురంధర్ ది రివెంజ్ చిత్రం తొలి ఆట నుంచే భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 1850 కోట్ల రూపాయలను వసూలు చేసి భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేసింది.

ఇలాంటి సంచలన చిత్రం జపాన్ భాషలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ సినిమాను జూలై 10, 2026 తేదీన రిలీజ్ చేస్తున్నాం. దురంధర్ గర్జన ఇక జపాన్ దేశంలో వినిపించున్నది. ఈ సందర్భంగా ఆ దేశంలోని భారతీయ సినిమా అభిమానులకు ఇదే ఆహ్వానం. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించండి అంటూ రణ్‌వీర్ సింగ్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

ఇప్పటి వరకు జపాన్ దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా పేరిట ఉంది. ఈ చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ధురంధర్ 1, ధురంధర్ 2 చిత్రాలు ఆ సినిమా కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో కొనసాగుతున్నది.

దురంధర్ సినిమా విషయానికి వస్తే.. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Read more about: Dhurandhar ranveer singh rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X