బాలీవుడ్ డ్రగ్స్ దందాలో దియా మిర్జా పేరు.. త్వరలోనే సమన్లు
బాలీవుడ్‌లో డ్రగ్ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బయటపెడుతున్నది. సోమవారం దీపికా పదుకోన్, ఆమె మేనేజర్ కరిష్మా పేర్లను బయటపెట్టిన ఎన్సీబీ అధికారులు మంగళవారం రోజున మరో స్టార్ హీరోయిన్ దియా మిర్జా పేరును బయటపెట్టినట్టు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో వాస్తవాలు రాబట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దియా మిర్జాకు త్వరలోనే సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. డ్రగ్స్ సప్లయిదార్లు అంకుష్, అనుజ్ కెశ్వానీని విచారించగా దియా పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తున్నది.
దియా మేనేజర్ డ్రగ్ సప్లయిర్ అనుజ్‌కు ప్రియురాలు. అనుజ్ లవర్ దియాకు డ్రగ్స్ సరఫరా చేసేవారనే విషయం వెలుగులోకి వచ్చింది. 2019లో డ్రగ్స్ సప్లయర్ల నుంచి దియా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించినట్టు అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. డ్రగ్ సప్లయిదార్లను దియా మేనేజర్ రెండు, మూడు కలిసినట్టు తెలుస్తున్నది.

తమ దర్యాప్తులో భాగంగా తొలుత దియా మేనేజర్‌కు నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత దియా మిర్జాకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తున్నది.
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో దీపిక పదుకోన్ మేనేజర్ జయ సాహాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న రియా చక్రవర్తి బెయిల్ కోసం చేసిన పిటిషన్‌ను తిరస్కరించి అక్టోబర్ 8వ తేదీ వరకు కస్టడీని విధించింది.


Click it and Unblock the Notifications











