రాజమౌళిని అల్లు అరవింద్ వేధించారా? మగధీర విషయంలో అలా అంటూ..!

ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎలాంటి మార్కెట్ ఉందో తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ జక్కన్నతో కలిసి పనిచేసేందుకు నిర్మాతలు, హీరోలు ఎంతో ఆసక్తిగా ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ కు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. దాంతో రాజమౌళి తన సినిమాను ఏ స్కేల్లో తీయాలనుకుంటే అలా తీసే స్వేచ్ఛను పొందారు. సినిమా తెరకెక్కించడం, అద్భుతమైన లోకేషన్లు, భారీ యాక్షన్లు సీన్లు, సెట్స్, మ్యూజిక్ విషయంలో ఇప్పుడు జక్కన్నకు నిర్మాతలు ఫ్రీడమ్ ఇస్తున్నారు.

కానీ ఒకప్పుడు మాత్రం రాజమౌళికి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆ స్వేచ్ఛ లేదని తెలుస్తోంది. ఎంతో విజన్ ఉన్నప్పటికీ నానా కష్టాలు పడాల్సి వచ్చింది మన జక్కన్న. ఆయన ఆలోచనలను ఆచరణలో పడి ఉంటే.. ఇప్పటికే చాలా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేసి ఉండేవారు మన జక్కన్న. మరి రాజమౌళికి ఎక్కడ అడ్డుకట్ట పడిందో తానే స్వయంగా చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాతతో జరిగిన ఘటననను వివరించారు. తన స్టోరీలోని బలాన్ని చూడకపోవడంతో ఎంతో బాధపడ్డానని, ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.

Did Allu Aravind harass Director SS Rajamouli for Magadheera

రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు డజన్ సినిమాలను తెరకెక్కించారు. ఇందులో అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడం విశేషం. ఒక్క సినిమా కూడా నెగెటివ్ టాక్ ను దరి చేరనివ్వలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్మురేపే కలెక్షన్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'మగధీర'తో టాలీవుడ్ లో ఫస్ట్ రూ.100 కోట్ల సినిమా రికార్డును కూడా జక్కన్న తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ సక్సెస్ ను అందుకొని రూ.150 కోట్ల వరకు తిరిగి వసూళ్లను అందించింది.

అయితే... ఈ చిత్రాన్ని కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేశారు. మాసీవ్ రెస్సాన్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. తను ఎంతగానో నమ్మిన కథకు మరింత ప్రాణం పోయాలని ఎస్ఎస్ రాజమౌళి ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారంట. మొదట తమిళంలో రిలీజ్ చేద్దామని 'మగధీర' ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ను అడిగారంట. ఆయన వినకపోవడంతో ఎలాగైనా రిలీజ్ చేయాలని అడుక్కునానని కూడా రాజమౌళి చెప్పారు. కనీసం తమిళ డబ్డ్ వర్షెన్ అయినా వదలాలని కోరినా అల్లు అరవింద్ ససేమిరా ఒప్పుకోలేదంట. దాంతో రాజమౌళి మొదటి పాన్ ఇండియా సినిమాకు అడ్డుకట్ట పడింది. 2009లోనే ఈ మూవీ ఇతర భాషలకు వెళ్లుంటే.. జక్కన్న ప్రయాణం మరింత స్పీడ్ ఉండేదని పలువురు భావిస్తున్నారు.

అల్లు అరవింద్ తో జరిగిన ఘటన తర్వాత నుంచి రాజమౌళి తన సినిమాలన్నింటిని డబ్డ్ వెర్షన్ లో తప్పనిసరిగా విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సహకరించిన ప్రొడ్యూసర్లతోనే కలిసి పనిచేశారు. అలా 'ఈగ'తో తన కల నెరవేరిందని చెప్పారు జక్కన్న. ఇక ఆ తర్వాత 'బాహుబలి' సిరీస్, ఆర్ఆర్ఆర్ లతో ఎలాంటి మేజిక్ చేశాడో తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అమోజాన్ అడవుల్లో భారీ అడ్వేంచర్ ఫిల్మ్ ను చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కు అంతా సిద్ధమవుతూ పూజా కార్యక్రమాన్ని కూడా ముగించారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ss rajamouli allu aravind ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X