సీక్రెట్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ ఎంగేజ్‌మెంట్.. డైవర్స్ తీసుకున్న స్టార్ హీరోతో!

సినీ ఇండస్ట్రీలో సీక్రెట్ డేటింగ్స్, మ్యారేజ్‌లు కామన్. పెళ్లి చేసుకోకుండా చాలా మంది హీరో, హీరోయిన్లు లివింగ్ రిలేషన్స్ ఉన్నవారున్నారు. పెళ్లి చేసుకోని మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వారున్నారు. ఎవరికి తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చూసుకున్న సెలబ్రెటీలు కూడా ఉన్నారు. సాధారణంగా ఏ సెలబ్రెటీ అయినా ఇతరులతో కాస్తా క్లోజ్ గా ఉంటే.. పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ అల్రెడీ పెళ్లై విడాకులు తీసుకున్న స్టార్ హీరోను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని ఫోటోలు వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో, హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి.

ఇంతకీ ఆ స్టార్ హిరోయిన్ ఎవరు? అని ఆలోచిస్తున్నారా.. అమ్మడు ఎవరో కాదు. మన నేచురల్ స్టార్ నాని హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan). గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ అమ్మడు. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది. తన అందం అభినయంతో విమర్శకుల ప్రశంశలను అందుకుంది ప్రియాంక మోహన్. ఫస్ట్ మూవీ హిట్ తో వరుస సినిమా చాన్సులను అందుకుంది. ఈ మధ్యనే సరి పోదా శనివారం సినిమాలో మరోసారి నానితో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమాలో కూడా ఈ బ్యూటీ లీడ్ రోల్లో నడుస్తుంది. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తూ తనకంటూ స్పెషల్ మార్కెట్ను క్రియేట్ చేసుకుంది ఈ తమిళ అమ్మడు.

Did Jayam Ravi and Priyanka Mohan Secretly Get Engaged in Goa Amid Divorce Row With Aarti wedding photo viral soial media

వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు సడన్ గా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఫోటోలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నామని జయం రవి ప్రకటించడంతో తన సమ్మతి లేకుండా విడాకులు తీసుకోబోతున్నట్టు ఎలా ప్రకటిస్తారంటూ ఆయన భార్య ఆర్తి స్పందించడంతో అభిమానులు షాక్ అయ్యారు.

అలాంటి స్టార్ హీరో జయం రవిని హీరోయిన్ ప్రియాంక మోహన్ పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా జయం రవి, ప్రియాంక మోహన్ దండలతో ఉన్న ఓ ఫోటో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యనే విడాకులు తీసుకున్న స్టార్ హీరో జయం రవి, ప్రియాంక మోహన్ లుగోవాలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక దానికి రుజువే ఈ ఫోటో అంటూ దండలు మార్చుకున్న ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక మోహన్ ను, మరోవైపు జయం రవిపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇదేం పద్దతి అంటూ నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Did Jayam Ravi and Priyanka Mohan Secretly Get Engaged in Goa Amid Divorce Row With Aarti wedding photo viral soial media
నిజం ఏమిటంటే.. హీరో జయం రవి, హీరోయిన్ ప్రియాంక మోహన్ లు జంటగా బ్రదర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా జరిగిన ఓ ఫోటో షూట్ ను మూవీ యూనిట్ నెట్టింట్లో షేర్ చేయడంతో జయం రవి, ప్రియాంక రహస్య వివాహం గురించి దుండగులు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇకపోతే.. బ్రదర్ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ఏడాది సరిపోదా శనివారం తో హిట్ ఖాతా తెరిచిన ప్రియాంక మోహన్.. బ్రదర్ తో ఇంకో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి. ఇదెలా ఉంటే.. ప్రియాంక మోహన్ తెలంగాణలోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిందని, అక్కడ ఆమె ఒక ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X