అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ బాయ్ కాట్.. పవన్ సెలబ్రేషన్ పార్టీకి దూరంగా ఐకాన్ స్టార్
మెగా ఫ్యామిలీలో అనుకున్నట్లుగా అందరూ ఒక్కటి కాదనే విషయం అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో బయటపడింది. మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు.. ఏ ఫంక్షన్ అయినా, సినిమా ఈవెంట్ అయినా అంతా ఒక్కచోటికి చేరుతారు. ఫోటోలకి ఫోజులు ఇస్తారు.. అవి బయటకు రాగానే అభిమానుల సంబరాలు మిన్నంటుతాయి. కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే ఇప్పుడు మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా అల్లు అర్జున్ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానుల మాట.
అప్పుడెప్పుడో బన్నీ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన ఓ మూవీ ఈవెంట్‌లో పవన్ అభిమానులు గోలతో ఆయన ప్రసంగానికి డిస్ట్రబెన్స్ వచ్చింది. పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా వినకపోవడంతో కోపం నషాళానికెక్కి పవన్ గురించి చెప్పను బ్రదర్ అనే మాట అనేశారు. ఆ క్షణం నుంచి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం మానేశారు. ఈ వివాదం తర్వాత కూడా పవన్ - బన్నీలు ఎప్పటిలాగే మసలుకున్నారు. కానీ ఒకానొక ఈవెంట్‌లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మాటతో మెగా ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. అంతే అల్లు అర్జున్‌పై ఉన్న కాస్త గౌరవం కూడా వదిలిపెట్టేశారు.

ఈ పరిణామాలు ఇలా సాగుతూ ఉండగా తాజా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఈ ఘటనతో మెగా, పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది.
సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా జనసేనాని బద్ధ వ్యతిరేకి జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు. పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ నాగబాబు ట్వీట్ చేసి ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.
అయితే ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓటమి పాలయ్యారు. ఈ రిజల్ట్‌తో అభిమానులు మరోసారి బన్నీని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్‌ఫాలో చేయడం దుమారం రేపుతోంది. పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు.

ఇక ఎన్నికల్లో ఘన విజయంతో పాటు డిప్యూటీ సీఎంగా పాలనలోనూ భాగం కావడంతో పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారట. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలోని అందరికీ ఆహ్వానం వెళ్లగా.. అల్లు ఫ్యామిలీకి ఏ ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలింనగర్ టాక్. దీనిని బట్టి చూస్తే.. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్‌ని అనధికారికంగా బాయ్‌కాట్ చేసినట్లేనని అర్ధమవుతోంది. అయితే కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు సహజమని.. గతం గత: అని వదిలేసి ఇకనైనా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ ముగిసి ఎప్పటిలాగా మెలిసి ఉండాలని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











