ఆ హీరోయిన్ కాళ్లు వెంకటేష్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందంటే? అసలేం జరిగిందంటే?
అగ్ర నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వెంకటేష్. విజయాల విషయంలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న అతికొద్దిమంది హీరోలలో ఒకరిగా విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు వెంకీ. కలియుగ పాండవులు చిత్రంతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. నిజానికి సూపర్‌స్టార్ కృష్ణ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఆయన బిజీగా ఉండటంతో పాటు కొన్ని కారణాలతో హీరోగా వెంకటేష్‌కు ఛాన్స్ వచ్చింది.
అమెరికాలో ఉన్న కొడుకుకి ఫోన్ చేసి ఆగమేఘాల మీద భారత్‌కు పిలిపించిన రామానాయుడు .. నెల రోజుల తక్కువ సమయంలోనే నటనలో శిక్షణ ఇప్పించారు. కే . రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులులో కుష్భూ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో వెంకీ హీరోగా బిజీ అయ్యారు. క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోవడం వెంకటేష్ స్టైల్. కుటుంబం అంతా సినిమాలు కలిసి చూసేలా ఆయన సినిమాలు ఉంటాయి. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ .. ఇలా ఏ రోల్ అయినా సరే వెంకీ మార్క్ తప్పనిసరి.

టాలీవుడ్‌లో వెంకటేష్‌కు అజాత శత్రువుగా పేరుంది. అందరు హీరోలు, దర్శక నిర్మాతలు, నటీనటులు ఆయనను ఎంతో ఇష్టపడతారు. సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ప్రాణం పోసింది వెంకీయే అనడంలో అతిశయోక్తి లేదు. కమల్ హాసన్‌తో ఈనాడు, పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, మహేశ్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తన మేనల్లుడు నాగచైతన్యతో వెంకీ మామ, రామ్ పోతినేనితో మసాలా, వరుణ్ తేజ్‌తో ఎఫ్2, ఎఫ్ 3 వంటి సినిమాల్లో ఆయన కలిసి నటించారు.
ఇకపోతే.. విక్టరీ వెంకటేష్ సరసన ఎంతోమంది హీరోయిన్లు ఆడిపాడారు. వీరందరిలోకి దివంగత సౌందర్య ఎంతో ప్రత్యేకం. వీరిద్దరూ కలిసి సూపర్ పోలీస్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, జయంమనదేరా, దేవీపుత్రుడు వంటి సినిమాల్లో నటించారు . ఈ సినిమాలన్నీ సూపర్‌హిట్లుగా నిలవడంతో వెంకీ - సౌందర్యల జోడీకి జనంలో హిట్ పెయిర్‌గా ముద్ర పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పుకార్లు రాయుళ్లు అఫైర్లు కూడా అంటగట్టారు.. అయినప్పటికీ వీరిద్దరూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు

అయితే ఒకానొక సమయంలో తాను సౌందర్య కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు వెంకటేష్. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవిత్ర బంధం సినిమా గురించి చెబుతూ ఆ మూవీ రిలీజ్ సమయంలో సౌందర్య కాళ్లను తాను పట్టుకునే సీన్ ఉందని దీనికి సంబంధించిన పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందని వెంకీ తెలిపారు. దీంతో చాలా మంది తనను భయపెట్టారని , కానీ కథ బాగుంటే జనం చూస్తారని తాను చెప్పేవాడినని.. అనుకున్నట్లుగానే పవిత్ర బంధం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











