Gangs of Godavari గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ ఛాయిస్ విశ్వక్ సేన్ కాదట... ముందు ఏ హీరోను అనుకొన్నారో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరికొన్ని గంటల్లోనే థియేటర్లలోకి రాబోతోంది. ఈ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీకి హీరోగా ఫస్ట్ ఛాయిస్ విశ్వక్ సేన్ కాదని తెలుస్తోంది. మరి ఇంతకీ మేకర్స్ ముందుగా ఈ సినిమాలో హీరోగా ఎవరిని అనుకున్నారు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 31న థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర బృందం. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ యాక్షన్ మూవీలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

Did you know Not Vishwak Sen but THIS actor was the first choice for Gangs of Godavari

ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన బాలయ్య వేదికపైనే హీరోయిన్ అంజలిని తోసేయడం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ తాగేసి అంజలితో దారుణంగా ప్రవర్తించాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈవెంట్ లో తాగడం లాంటిదేమీ జరగలేదని, బాలయ్య అంజలితో సరదాగానే మాట్లాడారని తాజాగా హీరో విశ్వక్ సేన్ తో పాటు నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. అంతలోనే ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫస్ట్ ఛాయిస్ విశ్వక్ సేన్ కాదని తెలుస్తోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణ చైతన్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ మూవీకి ముందుగా శర్వానంద్ ను హీరోగా అనుకున్నామని, కానీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు విశ్వక్ సేన్ దగ్గరకు చేరిందని చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ కథ నచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కిందంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు డైరెక్టర్.

Did you know Not Vishwak Sen but THIS actor was the first choice for Gangs of Godavari

ఇక గామి మూవీతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని చేస్తున్నాడు. మరి ఈ మూవీతో ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందా? అనే విషయం మూవీ రేపు థియేటర్లలోకి వచ్చాక తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X