Rajmouli: రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కెరీర్‌ మరోలా..

Trisha Rajamouli Movie : దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనుడు. ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం సౌత్ వరకే పరిమితం అయ్యేవి. కానీ, రాజమౌళి ఎంట్రీతో తెలుగు సినిమా ఖ్యాతి ఏకంగా పాన్ వరల్డ్ వరకు చేరింది. రాజమౌళి డిక్షనరీలో 'ఫెయిల్యూర్' అనే పదమే లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమాలోనైనా నటించాలని, స్టార్ హీరోయిన్ హీరోలు సైతం సంవత్సరాలకు అది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి దర్శక ధీరుడు రాజమౌళి ఒక క్రేజీ ఆఫర్ ఇస్తే .. ఓ స్టార్ హీరోయిన్ ఆఫర్ ను తిరస్కరించిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆఫర్లు రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి?

దర్శక ధీరుడు రాజమౌళి.. ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన తెలుగు చలనచిత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన స్టార్ హీరోలనే కాకుండా కమెడియన్లను, చివరికి 'ఈగ 'లాంటి యానిమేషన్ పాత్రలతో కూడా సక్సెస్ అందుకోగల ఘనుడు రాజమౌళి. ఆయన కెరీర్ వరుస హిట్లతో కొనసాగుతోంది. ఆయన దరక్షకత్వం వహించిన ఒక్క సినిమాలోనైనా నటించారని స్టార్ హీరోలు సైతం సంవత్సరాలకు వేచి ఉంటారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. తన కెరీర్లో ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడుగా రికార్డు క్రియేట్ చేశారు.

Did you know Trisha Once Rejected SS Rajamouli directed film Maryada Ramanna film In 2010

ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు ఇలాంటి రికార్డులను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు కలెక్షన్ల సునామీని సృష్టించి నయా రికార్డులను క్రియేట్ చేశాయనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి క్రేజీ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఆఫర్ ఇస్తే ఓ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష. దక్షిణాది సినిమాలలో నటించిన ఈ అమ్మడు.. జక్కన్న ఆపరిస్తే రిజెక్ట్ చేసిందట.

వివరాల్లోకి వెళితే రాజమౌళి 2009లో మగధీర సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. అనంతరం 2010లో కమెడియన్ సునీల్ ను హీరోగా పెట్టి మర్యాద రామన్న అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా స్టార్ హీరోయిన్ త్రిష ను హీరోయిన్ సెలెక్ట్ చేశారంట. ఆమని ఊహించుకొని కథను డిజైన్ చేయించారంట. కానీ జక్కన్న ఇచ్చిన ఆ క్రేజీ ఆఫర్ ను నటి త్రిష తిరస్కరించిందట. వాస్తవానికి ఆ ఆ సమయంలో త్రిష సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఆ సమయంలో తాను కమెడియన్ పక్కన హీరోయిన్ గా నటిస్తే.. తన కెరీర్ కు అలాగే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిందట. ఈ మేరకు రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిందట. దీంతో త్రిష ప్లేస్ లో సలోని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.

Did you know Trisha Once Rejected SS Rajamouli directed film Maryada Ramanna film In 2010

రాజమౌళి మార్క్​ స్టోరీతో, మంచి కామెడీ అండ్ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు అటు సలోనితో పాటు సునీల్ యాక్షన్ కూడా మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమా వారిద్దరి కెరీర్​ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలించింద. ఈ సినిమాలో త్రిష నటించి ఉంటే.. ఈ అమ్మడు కెరీర్ మరోలా ఉండేదనీ నెటిజన్లు భావిస్తున్నారు. ఇటు జక్కన్న పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే, మరోపక్క వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ స్టేటస్​ను సంపాదించుకుంది.

ఇదెలా ఉంటే.. మహేశ్- జక్కన్న కాంబోలో మూవీ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్​తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. మరోవైపు, త్రిష హీరోయిన్​ గా నటించిన 'విడాముయార్చి' అనే మూవీ ఇటీవలే రిలీజైంది. అలాగే ఆమె మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', కమల్ హాసన్ 'థగ్ లైఫ్' లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు నటి త్రిష.

More from Filmibeat

Read more about: trisha ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X