సందీప్ రెడ్డి వంగతో వివాదం.. స్పందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తో దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ముందు అర్జున్ రెడ్డి కథను పట్టుకొని ఐదేళ్లపాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని పలువురు నిర్మాతలను కలిసి కథ చెప్పిన ప్రయోజనం లేకపోయింది. చివరిగా 2017లో తన అన్న ప్రణయ్ రెడ్డి నిర్మాతగా, తమ సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ పై అర్జున్ రెడ్డి సినిమాను 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ తీరా ప్రేక్షకుల ముందుకు వచ్చాక టాక్ మారిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే సినిమా గురించి మాట్లాడేటప్పుడు సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ గురించి ఎంతలా మాట్లాడతారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు విషయంలోనూ అంతే క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకు పాటలు అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు రాధన్ కావడం విశేషం. అయితే ఈ సినిమా మేకింగ్ సమయంలో సంగీత దర్శకుడు రధన్ కు సందీప్ రెడ్డికి మధ్య చిన్న ఘర్షణ జరిగిందని వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అది ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ కూడా ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.

Differences with Director Sandeep Reddy Vanga

గతంలో సందీప్ రెడ్డి వంగ ఈ విషయంపై మాట్లాడడం తో సంగీత దర్శకుడు రధన్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. సందీప్ రెడ్డి వంగను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ చాలా ఇబ్బంది పెట్టారని గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఆ సినిమాలో పాటలు ఒకరు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించడం తెలిసిన సంగతే. రధన్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికిని తన బిహేవియర్ వల్ల చిరాకు వచ్చిందని, ప్రాజెక్టు విషయంలో సరిగా ఉండలేదని అప్పట్లో సందీప్ రెడ్డి వంగ బహిరంగంగా చెప్పేశారు.

అయితే ఆ సంగీత దర్శకుడు రధం తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు రధన్ తాజాగా సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మొన్నటి వరకు నిర్వహించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో సంగీత దర్శకుడు రధన్ కూడా పాల్గొన్నారు. చాలాకాలం తర్వాత ఆయన ఇలా మీడియా ముందు కనిపించడంతో సందీప్ రెడ్డి వంగ తో తనకు ఉన్న విభేదాలు ఏంటి అని ప్రశ్నించారు. దీనిపై రధన్ సానుకూలంగా స్పందించారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనను తిట్టినట్లయితే ఆ మాటలను తన తండ్రి తిట్టినట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు అది సహజం. ఇక సందీప్ రెడ్డి వంగా మాటలు కూడా తనకు అలానే అని చెప్పుకొచ్చారు. తన బిహేవియర్ సరిగా లేకపోతే తనకు జాతి రత్నాలు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఆఫర్లు ఎలా వస్తాయని తిరిగి ప్రశ్నించారు. ఇంకా ఎవరు ఎవరితో ఎలా ఉన్నా పని బాగుంటే సరిపోతుందని, పనితో ప్రజలకు సంబంధం ఉంటుందని చెప్పారు. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ తనకు గ్రేట్ డైరెక్టర్ అని చెప్పుకొచ్చారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత చాలా సినిమాలకు రధన్ సంగీతం అందించారు. హుషారు, జాతి రత్నాలు, పాగల్, అద్భుతం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, సిద్ధార్థ రాయ్, తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X