twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాప్ ద్వారా దిక్యూచి పాటలు.. మ్యూజిక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు.. దర్శకుడు దిలీప్

    |

    దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా అయన స్వీయ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం "దిక్సూచి".. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పిస్తుండగా శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమాపై మంచి ఆసక్తిని పెంచుతున్నది. ఏప్రిల్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ని 'దిక్సూచి మ్యూజిక్' అనే యాప్ ద్వారా రిలీజ్ చేశారు దర్శక, నిర్మాతలు. హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ఈ కార్యక్రమానికి చిత్రబృందం హాజరైంది..

    ఈ సందర్భంగా దర్శకుడు, హీరో దిలీప్‌కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ..దిక్సూచి చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌ గా తెరకెక్కుతుంది.. థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో పాటు అన్నిరకాల ఎమోషన్స్ ఈ సినిమా లో ఉన్నాయి.. రెండు గంటలు మిమ్మల్ని తప్పకుండా ఆనందింపచేస్తుంది..ఉగాది రోజు ఇదే బ్యానర్‌లో ఇంకో సినిమా చేస్తున్నాం.. మళ్ళీ నాకు అవకాశమిచ్చిన ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు.

    Diksoochi songs released on Diksoochi app

    ఈ చిత్ర ఆడియోని రిలీజ్ చేశాక మ్యూజిక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు.. మేమే సొంతంగా రిలీజ్ చేయాలనీ 'దిక్సూచి మ్యూజిక్' అనే యాప్‌ను క్రియేట్ చేశాం. ఈ యాప్ ద్వారా ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేస్తున్నాం.. ఈ యాప్ ద్వారా భవిష్యత్‌లో మరిన్ని సినిమా పాటలను రిలీజ్ చేయబోతున్నాం..

    ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మా చిత్ర యూనిట్ అక్కడ నిర్వహించిన కార్యక్రమానికి, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఎన్నారైలు కూడా తెలుగులో సినిమాలు నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నాం. దాని పేరు రెయిన్‌బో కార్పెట్‌షోగా నిర్ణయించాం. ఈ ఈవెంట్‌కు సాధారణ ప్రేక్షకులను ఆహ్వానించి సినిమాను చూపిస్తాం. వారి నుంచి సినిమాపై అభిప్రాయాలను సేకరిస్తాం. ఇలాంటి ప్రమోషన్ ఎవరు చేయలేదు..ఏప్రిల్ మూడో వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు..

    నిర్మాత నరసింహరాజు రాచూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ ఉన్న చిత్రం.. ఇందులో ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు లేవు, కథ నచ్చి చేసిన సినిమా ఇది.. అందుకే ఈ సినిమా ని నిర్మించాను.. ఈ సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది.. ఒక మంచి సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్లాలనేదే నా తాపత్రయం.. ఈ సినిమా ని ఆదరించి హిట్ చేయాలి అని కోరుతున్నాను అన్నారు..

    నటుడు అరుణ్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేశారు.. ఒక సామాన్యుడిగా దిలీప్ ఈ సినిమా చేశాడు, రేపు అయన అసామాన్యుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను.. అలాగే ప్రొడ్యూసర్ గారికి సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అని అన్నారు.

    దిక్చూచి చిత్రంలో

    దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి, రాకేష్, మల్లాది భాస్కర్, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించారు. ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్స్ః న‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాః జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మనాభ్ భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్‌, డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది

    English summary
    Child artist Dileep Kumar Salwadi becomes hero cum director for Diksoochi movie. This movie is getting ready for the release in April. In this occassion, movie trailer released by director Kranthi Madhav. On March 20th, music released on Diksoochi app.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X