సింగిల్ కట్ లేకుండా దిక్సూచి.. సెన్సార్ ప్రశంసలు.. ఏప్రిల్ 26న విడుదల
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దిక్సూచి". డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహారాజు రాచూరి నిర్మిస్తున్నారు. బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చెసుకుని ఈ నెల 26న విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు హీరో దిలీప్ కుమార్, హీరోయిన్ చాందినీ, నిర్మాత నరసింహారాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ... దిక్సూచి సినిమా సెన్సార్ అయింది. ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. సినిమా చూసిన తర్వాత ఇంప్రెస్ అయిన జేమ్స్ అమెరికాలో విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే ఆస్ట్రేలియాలొ సైతం చాలా ప్రాంతాల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.

జేమ్స్ మాట్లాడుతూ.. దిక్సూచి సినిమా చూశాను. మంచి కంటెంట్‌తో కూడి చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావించిన అమెరికాలో విడుదల చెస్తున్నాం. చిన్న సినిమా అయినా
15 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నామన్నారు. నిర్మాత రాజు సినిమాలపై అభిరుచితో తీసిన చిత్రమిది. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత నర్సింహ రాజు మాట్లాడుతూ.. సినిమా లో కంటెంట్ ఉంది. అందుకే నిర్మాతగా మారి దిక్సూచి తీశాము. విడుదలైన అనంతరం మా సినిమా గురించి ప్రేక్షకులె మాట్లాడతారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాందినీ, సుమన్ పాల్గొన్నారు.
నటీనటులు: దిలీప్‌కుమార్ సల్వాది, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్, రజిత్ సాగర్, అరుణ్‌బాబు, రాకేష్ ధన్వి
ప్రొడ్యూసర్స్: నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల,
కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి,
మ్యూజిక్ డైరెక్టర్: పద్మనాభ్ భరద్వాజ్,
లిరిక్స్: శ్రీరామ్ తపస్వీ,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, కట్స్, డైరెక్షన్: దిలీప్‌కుమార్ సల్వాది.


Click it and Unblock the Notifications











