ఫారిన్‌లో భార్యతో చిల్ అవుతోన్న దిల్‌రాజు.. గుడ్‌న్యూస్ చెబుతారా!
తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే నలుగురు వ్యక్తుల్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా ఒకరని ఫిలింనగర్ టాక్. దాదాపు పాతికేళ్లుగా దిల్‌రాజు టాలీవుడ్‌లో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న అందరు అగ్ర హీరోలతో పాటు తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ తన స్థానాన్ని కాపాడుకుంటున్నారు. దిల్‌రాజు పనైపోయిందని అనుకున్నప్పుడల్లా.. తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు.
డిస్ట్రిబ్యూటర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ
నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన దిల్ రాజు అసలు పేరు వెంకట రమణా రెడ్డి. తొలుత తన సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారాన్ని నడిపించిన ఆయన తర్వాత 1990లలో సినిమాలకు పంపిణీదారుడిగా మారారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ పేరిట జగపతిబాబు నటించిన పెళ్లి పందిరి డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన తొలి చిత్రం. సినిమా నిర్మాణం, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌పై అనుభవం సంపాదించిన ఆయన కొందరు మిత్రులు, సన్నిహితుల సూచన మేరకు నిర్మాతగా మారారు.

దిల్ చిత్రంతో నిర్మాతగా
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించిన దిల్‌రాజు 2003లో నితిన్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్‌ను నిర్మించి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. దిల్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని నాటి నుంచి నేటి వరకు 50కు పైగా సినిమాలు నిర్మించారు. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం దిల్‌రాజు బ్యానర్‌పై 50వ సినిమా.
80 శాతం సక్సెస్ రేటు
దిల్‌రాజు సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80 శాతం సక్సెస్ రేటు ఉదంటే దిల్‌రాజు సమర్ధతను అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా దిల్‌రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో ఆయన కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం నితిన్‌తో తమ్ముడు సినిమాను నిర్మిస్తున్నారు దిల్‌రాజు. ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా తీసే ప్లాన్‌లో ఉన్నారు దిల్‌రాజు.
భార్యతో ఫారిన్ వెకేషన్‌కి
దిల్‌రాజుకు తొలుత అనితతో వివాహం జరిగింది. ఈ దంపతులకు హన్షితా రెడ్డి సంతానం. అయితే 2017లో గుండెపోటుతో అనిత కన్నుమూశారు. భార్య మరణంతో కృంగిపోయిన దిల్‌రాజు తర్వాత కుమార్తె, ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు 2020లో తేజస్వినిని పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు అన్వయ్ రెడ్డి జన్మించారు. భార్యతో కలిసి వెకేషన్‌కు , తీర్ధయాత్రలకు వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు దిల్‌రాజు. సమ్మర్ కావడంతో భార్యతో కలిసి ఫారిన్‌కు వెళ్లిన దిల్‌రాజు.. అక్కడ ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తేజస్వినీని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని సైక్లింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో దిల్‌రాజు దంపతులు మరో గుడ్‌న్యూస్ చెబుతారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











