పవన్ కల్యాణ్‌తో వంశీ పైడిపల్లి మూవీ.. త్వరలోనే దిల్ రాజుతో కలిసి..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో జోరును కొనసాగిస్తున్నారు. వకీల్ సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రికార్డు వసూళ్లను సాధించాడు. ఇక క్రిష్‌తో హరిహర వీరమల్లు, దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ చిత్రం, డైరెక్టర్ సాగర్‌తో అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్‌తో బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది.

పూలతో అందాలను దాచేస్తున్న జక్వాలిన్ ఫెర్నాండెజ్

పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు సరిపడే స్క్రిప్టును వంశీ పైడిపల్లి ఇప్పటికే రెడీ చేశారు. ఆ కథలో కమర్షియల్ విలువలతోపాటు చక్కటి సామాజిక సందేశం కూడా ఉంది. పవన్ కల్యాణ్ ఆ సినిమా చేస్తే ఫర్‌ఫెక్ట్‌గా ఉంటుందనే భావనలో ఉన్నారు. నిర్మాత దిల్ రాజును కూడా కన్విన్స్ చేశాడు. అంతా సవ్యంగా సాగితే త్వరలోనే దిల్ రాజుతో కలిసి పవన్ కల్యాణ్‌కు కథను చెప్పేందుకు సిద్ధమవుతున్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Dil Raju and Vamshi Paidipally ready to narrate story to Pawan Kalyan

ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.90 కోట్ల షేర్, రూ.125 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వకీల్ సాబ్ సినిమా పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది.

థియేటర్లలో అభిమానులను అలరించిన వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X