మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన దిల్ రాజు!

సూపర్ స్టార్ మహెష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. బృందావనం, ఎవడు, ఊపిరి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సందేశాత్మక కథతో రూపొందితున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు ఈ చిత్రంలో స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ సీఈవోగా, రైతుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా మూడు విభిన్న కోణాల్లో నటిస్తున్నాడు. పూజ హెగ్డే తొలిసారి మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ముందుగా మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ మహర్షి విడుదుల తేదీ వాయిదా పడిందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కొత్త విడుదుల తేదీని ప్రకటించారు. దిల్ రాజు నిర్మించిన ఎఫ్2 చిత్రం సంచలన విజయం సాధించి వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఈ సంతోషంలో దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Dil Raju announces Mahesh Babus Maharshi movie release date

కొండపై మీడియాతో మాట్లాడుతూ మహర్షి విడుదల తేదీని ప్రకటించారు. మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నాం అని ప్రకటించారు. ఈ చిత్రానికి అశ్విని దత్ కూడా మరో నిర్మాత. ఈ చిత్రంలో అల్లరి నరేష్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X