బాలయ్య - బోయపాటి సినిమాలో భాగమైన దిల్ రాజు: గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న ప్రొడ్యూసర్

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో 'సింహా', 'లెజెండ్' చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దీనికి కారణం వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో ఈ చిత్రాలే ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించాయి. ఈ రెండు సినిమాలనూ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే తెరకెక్కించాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరి కలయికలో మూడో సినిమా రాబోతుంది. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రెండు భారీ సూపర్ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రీతిలో ఉన్నాయి. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. BB3 నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారట. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించారని తెలిసింది.

Dil Raju Bagged Boyapati Srinu - Nandamuri Balakrishna Movie Rights

అంతేకాదు, దీన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఆయన ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే రోజున రవితేజ నటిస్తోన్న 'ఖిలాడీ' కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇందులో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్‌ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తుండగా.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X