Saripodha Sanivaaram: దిల్ రాజు చేతికి నాని మూవీ.. ఏకంగా అన్ని కోట్లతో డీల్
టాలీవుడ్‌లోని కొందరు హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి డీసెంట్ హిట్లతో సత్తా చాటిన అతడు.. కెరీర్‌లోనే బీభత్సమైన ఫామ్‌తో జెట్ స్పీడుతో ముందుకు సాగుతున్నాడు. ఈ ఊపులోనే నాని మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.
'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ కాకుండానే నాని తన 31వ సినిమాను కూడా లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' వంటి క్రేజీ మూవీలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నాడు. 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి.

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని మరికొన్ని నెలల్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఇదే అదునుగా చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలు పెట్టినట్లు తెలిసింది. దీనిపై తాజాగా ఓ ప్రకటనను కూడా వదిలింది.

నాని నటిస్తోన్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధినేత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇందుకోసం ఆయన ఏకంగా రూ. 25 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, దిల్ రాజు చేతికి వెళ్లడంతో నాని సినిమాకు గ్రాండ్ రిలీజ్ దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











