యువ దర్శకుడితో RRR హీరో.. నెవర్ బిఫోర్ అనేలా కాంబో సెట్ చేస్తున్న దిల్ రాజు

నిర్మాత అనగానే కేవలం బడ్జెట్ కేటాయిస్తే చాలు సినిమా రిజల్ట్ మొత్తం దర్శకుడు, హీరో పైనే ఉంటుందని అనుకుంటారు చాలా మంది. కానీ ఒక సినిమా ప్రాణం నిలవాలి అంటే నిర్మాత కృషి చాలానే ఉంటుంది. మొదటి అడుగు ప్రొడ్యూసర్ వేయకపోతే ఏ సినిమా కూడా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. ఇక ఎలాంటి సినిమానైనా నిర్మించగలడని నిరూపించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. అయితే కాంబినేషన్స్ సెట్ చేయడంలో దిల్ రాజు ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్ట్స్ ఆయన RRR హీరోతో చేయబోతున్న ఒక ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

స్టార్ హీరోలు కూడా ఆయన వైపే..

స్టార్ హీరోలు కూడా ఆయన వైపే..

దిల్ రాజు ఒక కథను నమ్మడు అంటే దాన్ని నిర్మించే వరకు కూడా వెనుకడుగు వేయడు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. అందుకే చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడుతుంటారు. ఇక దర్శకులు కూడా దిల్ రాజుతో ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకుల్లో సగం మంది దిల్ రాజు బ్యానర్ లో పరిచయమైనవారే.

 జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు

జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు

అసలు మ్యాటర్ లోకి వస్తే RRR సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఇటీవల దిల్ రాజు ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఒక కథ గురించి ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్నారట. ఇక నెక్స్ట్ మీటింగ్ లో దర్శకుడితో కథ చెప్పిస్తానని కూడా దిల్ రాజు తారక్ కు వివరించినట్లు తెలుస్తోంది. అందుకు తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

దర్శకుడు ఎవరంటే..

దర్శకుడు ఎవరంటే..

ఇక ఆ దర్శకుడు ఎవరంటే.. ఈ ఏడాది హిట్ సినిమాతో పాజిటివ్ హిట్ అందుకున్న శైలేష్ కొలను. నాని సమర్పణలో వచ్చిన ఆ సినిమా హిట్టయిన తరువాత దర్శకుడికి చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇక దిల్ రాజు కూడా మంచి కథ ఉంటే చెప్పమని అప్పుడే సలహా ఇచ్చాడట. స్టార్ హీరోతో సినిమా చేసేలా కథను రెడీ చేయమని చెప్పడంతో లాక్ డౌన్ లో శైలేష్ ఒక మాస్ అండ్ యాక్షన్ స్టోరీని సెట్ చేసినట్లు తెలుస్తోంది.

బిగ్ బడ్జెట్ లో తెరకెక్కించాలని..

బిగ్ బడ్జెట్ లో తెరకెక్కించాలని..

గత కొన్ని వారాల నుంచి కథపై చర్చలు జరిపిన దిల్ రాజు దర్శకుడిపై పూర్తి నమ్మకం కలగడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ గా సెట్టవుతాడాని చెప్పి దర్శకుడికి ముందే క్లారిటీ ఇచ్చాడట. ఇక కథ గురించి తారక్ కు చెప్పడంతో ముందు పూర్తి కథను వినాడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తారక్ ఒప్పుకుంటే బిగ్ బడ్జెట్ లో క్రేజ్ కు తగ్గట్లుగా సినిమాను నిర్మించాలని దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X