దిల్ రాజు ఇంటిలో పెళ్లి బాజాలు.. జూనియర్ ఎన్టీఆర్, ఇతర ప్రముఖులకు స్వయంగా ఆహ్వానాలు!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తమ కుటుంబ సినీ వారసత్వాన్ని అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో ఆశీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ తెలుగు సినిమా ప్రముఖులకు స్వయంగా దిల్ రాజు కుటుంబ సభ్యులు అందిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు కుటుంబ సభ్యులు ఫోటోలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెండేళ్ల క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ద్వారా చురుకైన, టాలెంటెడ్ యాక్టర్ అనే గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ సినిమా తర్వాత ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలు చేస్తున్నాడు.

Dil Raju brother Son Ashish Reddy wedding: Shirish invited Jr NTR for Marriage

రౌడీ బాయ్స్ సినిమా తర్వాత ఆశీష్ రెడ్డి నటించిన సెల్ఫీష్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సినిమా తర్వాత మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాడు. ఈ క్రమంలో పెళ్లికి కూడా సిద్దమవుతున్నాడు.

ఆశీష్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రేమతో కూడిన పెద్దలు కుదిర్చిన వివాహంగా జరుగుబోతున్నది. ఇరు కుటుంబాలకు సన్నిహితంగా ఉండటంతో పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దాంతో ఈ వివాహం ఫిబ్రవరి 14వ తేదీన జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Dil Raju brother Son Ashish Reddy wedding: Shirish invited Jr NTR for Marriage

ఇక దిల్ రాజు, శిరీష్, ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, హర్షిత రెడ్డి సినీ ప్రముఖులకు వెడ్డింగ్ కార్డులను పంచుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి వివాహానికి హాజరుకావాలని ఆయనను కోరారు. ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X