twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు వారసుడి రెండో సినిమా.. సుకుమార్ కాంపౌండ్ లోనే సెల్ఫిష్ గా..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి వెండితెరకు పరిచయమైన యువ హీరోలలో ఆశిష్ రెడ్డి ఒకరు. సీనియర్ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కుర్రాడికి స్టార్ హీరోల భారీ స్థాయిలో మద్దతు లభించింది.. ఎలాగైనా ఆశిష్ రెడ్డి రెడ్డిని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలి అని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రౌడీ బాయ్స్ తో సంక్రాంతి బరిలోకి దిగిన ఆశిష్ రెడ్డి భారీ స్థాయిలో సక్సెస్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అయితే అప్పుడే అతని రెండో సినిమాకు సంబంధించిన అప్డేట్ విషయంలో కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు.

    దిల్ రాజు బ్యానర్ లో..

    దిల్ రాజు బ్యానర్ లో..

    గత పాతికేళ్లకు పైగా చిత్రపరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దిల్ రాజు తన బ్యానర్ లో చాలామంది దర్శకులను నటీనటులను చిత్ర పరిశ్రమలోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్న దిల్ రాజు ఒకప్పుడు మాత్రం ఎక్కువగా కొత్తవారితో ప్రయోగాలు చేస్తూ ఉండేవారు.

    మొదటి వారసుడు

    మొదటి వారసుడు

    ఇక మొదటి సారి దిల్ రాజు తన కుటుంబం నుంచి ఒక నటుడిని వెండి తెర పైకి తీసుకు వచ్చారు. సోదరుడు శిరీష తనయుడు ఆశిష్ రెడ్డి చిన్నతనం నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు.. అయితే అతడిని చదువు మొత్తం పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి రానివ్వాలి దిల్ రాజు చాలా క్రమశిక్షణతో పెంచుతూ వచ్చాడు.

    స్టార్ హీరోలతో..

    స్టార్ హీరోలతో..

    సోదరుడి కొడుకు అయినప్పటికీ కూడా ఆశిష్ రెడ్డి దిల్ రాజుతోనే ఎక్కువగా క్లోజ్ గా ఉండేవాడట. ఇక ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండడంతో దిల్ రాజు తన శక్తిమేరకు మొదటి సినిమాను భారీగానే ప్రమోట్ చేశాడు. రౌడీ బాయ్స్ సినిమా కోసం ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలు కూడా ప్రమోషన్ లో ఏదో ఒక విధంగా వారి మద్దతు అందించారు.

    పాజిటివ్ టాక్

    పాజిటివ్ టాక్

    రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ ఎక్కువగా యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా నటించాడు అనే చెప్పాలి.. కేవలం యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా డాన్స్ రొమాన్స్ తో కూడా షాక్ ఇచ్చాడు. సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బాగానే క్లిక్ అయ్యాయి. ఓ వర్గం ఆడియెన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది.

    సుకుమార్ కాంపౌండ్ లో..

    సుకుమార్ కాంపౌండ్ లో..

    రౌడీ బాయ్స్ సినిమా థియేటర్స్ లో కొనసాగే సమయంలో లెనే దిల్ రాజు ఆశిష్ రెడ్డి రెండో సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. సుకుమార్ దగ్గర ఎంతోకాలంగా సహాయ దర్శకుడిగా పని చేస్తున్న కాశి అని ఒక యువ దర్శకుడు ఆశిష్ రెడ్డి తో తన రెండో సినిమా లో డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ తోనే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఆ సినిమాను నిర్మిస్తారట.

     టైటిల్ ఫిక్స్

    టైటిల్ ఫిక్స్

    ఇక ఆశిష్ రెడ్డి రెండో సినిమాకు ప్రత్యేకమైన టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలియజేశారు. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు 'సెల్ఫీష్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.. రెండో సినిమాలో ఆశిష్ మరికొంత డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లో సినిమాను మొదలు పెట్టి వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట.

    English summary
    Dil raju clarification on ashish reddy second movie in sukumar writings..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X