Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
F3 సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు..ఆ హీరోలు కూడా.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత వస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్టైనర్ సినిమా F 3 భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. వెంకటేశ్ వరుణ్ తేజ్ కలిసి నటించిన అల్టిమేట్ కామెడీ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. F 2 సినిమాకు ఫ్రాంచైజ్ గా రూపొందించిన F 3 సినిమాలో ఈసారి మరికొంతమంది కామెడీ యాక్టర్స్ కూడా భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రహీరోలను కూడా సరికొత్తగా చూపిస్తాడట. ఆ విషయంలో దిల్ రాజు ఇటీవల క్లారిటీ ఇచ్చాడు.. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video
అంతకుమించి ఎంటర్టైన్మెంట్
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకవైపు పెద్ద సినిమాలను చేస్తూనే మరొకవైపు మీడియం రేంజ్ హీరోలతో కూడా కామెడీ సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అతను మళ్ళీ స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా F 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. F2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు F3 సినిమా తో అంతకుమించి అనేలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.
విభిన్నమైన షేడ్స్ తో..
వెంకటేష్ వరుణ్ తేజ్ తో పాటు తమన్నా భాటియా మెహ్రీన్ ఫిర్జాదా ఎప్పటిలానే వారి పాత్రల్లో కనిపించబోతున్నారు. మిగతా వారు మాత్రం విభిన్నమైన షేడ్స్ తో సరికొత్తగా కనిపిస్తారు అని తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అంటున్నారు అంతే కాకుండా ఈ సినిమా టికెట్ల రేట్లను ఏ మాత్రం పెంచలేదు అని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా దిల్ రాజు వివరణ ఇచ్చారు.
అలసి పోకుండా..
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు. బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్లుగా తెలుస్తోంది దాదాపు 50 కోట్లకు పైగా F3 సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. తప్పకుండా మొదటి రోజే ఊహించని విధంగా ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా చెబుతున్నారు. ప్రమోషన్స్ విషయంలో అయితే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం అలసి పోకుండా నాన్ స్టాప్ గా సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలి ప్రయత్నం అయితే చేస్తున్నారు.
F 3 లో పవన్ కళ్యాణ్
అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ప్రత్యేకంగా కనిపించబోతున్నట్లు దర్శకుడు దిల్ రాజు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తాడు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం నిజమే అని తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అని అన్నారు.
మిగతా హీరోలు కూడా..
కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోని మిగతా అగ్ర హీరోలు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అని దర్శకుడు అనిల్ రావిపూడి ఆ హీరోలందరినీ తన మ్యాజిక్ తో చాలా పర్ఫెక్ట్ గా చూపించబోతున్నారు తెలియజేశారు. ఇక అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన ఆ సీన్ సినిమాలో మొత్తం లో హైలెట్ గా నిలుస్తుంది అని కూడా దిల్ రాజు నమ్మకంగా తెలియజేశారు. మరి ఈ సినిమా మొత్తంగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.